అఖిలేశ్ కు మద్దతుగా రంగంలోకి మమతా బెనర్జీ!

అఖిలేశ్ కు మద్దతుగా రంగంలోకి మమతా బెనర్జీ!
యూపీలో పోటీ చేయకూడదని నిర్ణయం
ఎస్పీ చీఫ్ అఖిలేశ్ తో కలసి మమత ప్రచారం
లక్నో, వారణాసిలో వర్చువల్ సభలు
పార్టీ వైస్ ప్రెసిడెంట్ నందా ప్రకటన

యూపీ లో బీజేపీ ని గద్దె దించటమే లక్ష్యంగా ప్రాంతీయపార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ యూపీ లో బీజేపీ కి వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించగా బెంగాల్ సీఎం మమతా సైతం అదే బాట పట్టారు .ఆమె ఎస్పీ చీఫ్ అఖిలేష్ తో కలిసి లక్నో ,వారణాసి లలో ప్రచారం చేయనున్నారు. కేసీఆర్ సైతం లక్నో సందర్శించనున్నారు .బీజేపీకి ప్రధాన సవాల్ విసురుతున్న అఖిలేష్ కు ప్రజల్లో అనూహ్య మద్దతు పెరుగుతుండం ప్రాంతీయ పార్టీల సహకారంతో దూకుడు పెంచారు . బీజేపీ నుంచి అనేకమంది ఎమ్మెల్యేలు , మంత్రులు ఎస్పీ లో చేరడం తమకు శుభపరిణామంగా ఎస్పీ నేతలు భావిస్తున్నారు .

ఉత్తరప్రదేశ్ లో అధికారిక బీజేపీని దెబ్బ కొట్టేందుకు ప్రాంతీయ పార్టీలు ఏకమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) యూపీకి వెళ్లి అక్కడ సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)కి మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇటువంటి నిర్ణయమే తీసుకుంది. పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూపీలో అఖిలేశ్ కు మద్దతుగా ప్రచారం చేస్తారని.. యూపీ ఎన్నికల్లో ఎస్పీ పోటీకి దూరంగా ఉంటుందని పార్టీ వైస్ ప్రెసిడెంట్ కిరణ్మయి నందా తెలిపారు.

కిరణ్మయి నందా యూపీకి వెళ్లి ఇదే విషయమై ఎస్పీతో చర్చించిన అనంతరం బెంగాల్ కు తిరిగొచ్చి పార్టీ అధినేత్రితో సమావేశమయ్యారు. అనంతరం ప్రకటన చేశారు. ‘‘యూపీలో తృణమూల్ కాంగ్రెస్ పోటీకి దిగదు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తాం. లక్నో, వారణాసి సభల్లో అఖిలేశ్ యాదవ్ తో కలసి దీది ప్రచారం నిర్వహిస్తారు’’ అని తెలిపారు. ఫిబ్రవరి 8న లక్నో సభ ఉంటుందని, వారణాసి సభ తేదీ ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నారు. మమతా బెనర్జీ బలమైన నాయకురాలని, బెంగాల్ లో బీజేపీని ఓడించిన తీరు ప్రతిపక్షాలు అన్నింటికీ ఒక పాఠం వంటిదన్నారు.

Leave a Reply

%d bloggers like this: