వైసీపీ ఎమ్మెల్యే పద్మావతి కనపడటం లేదంటూ పోస్టర్లు…పద్మావతి స్పందన!

వైసీపీ ఎమ్మెల్యే పద్మావతి కనపడటం లేదంటూ పోస్టర్లు…

  • అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో పోస్టర్లు
  • గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని పోస్టర్లు
  • ఆచూకీ తెలుపగలరని కోరిన గుంజేపల్లి గ్రామ ప్రజలు

అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కనిపించడం లేదంటూ నియోజకవర్గంలో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ‘ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి. శింగనమల ఎమ్మెల్యే గారు. ఎలెక్షన్ టైమ్ లో ఓటు అడగడానికి వచ్చిన పద్మావతిగారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓటు వేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజా సమస్యలను పక్కకి నెట్టి ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆచూకీ తెలుపగలరు. ఇట్లు గుంజేపల్లి గ్రామ ప్రజలు. శింగనమల నియోజకవర్గం’ అని పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే తమకు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ పోస్టర్లు వేశామని చెప్పారు. ఈ పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎమ్మెల్యే పద్మావతి స్పందన
వైసీపీ శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కనిపించడం లేదని ఆమె నియోజకవర్గంలో పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పద్మావతి స్పందిస్తూ… తాను రెండు రోజులు కనిపించకపోతేనే తన నియోజకవర్గంలోని గుంజేపల్లి ప్రజలు తనను మిస్ అవుతున్నట్టు ఫీలవుతున్నారని సెటైర్ వేశారు.
ఈ నెల 16న తన భర్త సాంబశివారెడ్డికి కరోనా సోకిందని, అందువల్ల తామంతా క్వారంటైన్ లో ఉన్నామని పద్మావతి తెలిపారు. కరోనా వచ్చినా పర్వాలేదు, తనను కలవాలనుకుంటే గుంజేపల్లి గ్రామస్తులు తన ఇంటికి రావచ్చని అన్నారు. గుంజేపల్లిలోని కొందరు కులాన్ని పట్టుకుని వేలాడుతున్నారని, ఎవరి కులం వారికి గొప్పదని చెప్పారు. తాను కనిపించడం లేదని పోస్టర్లు పెట్టిన వారి అంతరంగం ఏమిటో తనకు అర్థం కావడం లేదని అన్నారు.

Leave a Reply

%d bloggers like this: