దేవాదాయ శాఖ‌లో అవినీతి వాస్త‌వ‌మే..ఏపీ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌!

దేవాదాయ శాఖ‌లో అవినీతి వాస్త‌వ‌మే… ఏపీ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌!

  • దేవా‌దాయ శాఖ మంత్రి కొట్టు ప‌ద‌వీ బాధ్య‌త‌ల స్వీకారం
  • దేవా‌దాయ శాఖ‌లో అవినీతిని నిర్మూలిస్తాన‌ని హామీ 
  • ఇకపై ఆల‌యాల్లో సామాన్యుల‌కే ప్రాధాన్య‌మ‌న్న మంత్రి

ఏపీలో మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ త‌ర్వాత దేవా‌దాయ శాఖ మంత్రిగా ప‌ద‌వి ద‌క్కించుకున్న కొట్టు స‌త్య‌నారాయ‌ణ సోమ‌వారం మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన మంత్రి.. దేవా‌దాయ శాఖ‌లో అవినీతి వాస్త‌వ‌మేనంటూ అంగీకరించారు. తాను మాత్రం ఈ శాఖ నుంచి అవినీతిని నిర్మూలించే దిశ‌గా ప‌నిచేస్తాన‌ని ఆయ‌న తెలిపారు.

సోమ‌వారం దేవాదాయ శాఖ మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం విజ‌య‌వాడ‌లో ఆ శాఖ కార్యాల‌యాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కూడా మంత్రి ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌పై దేవాల‌యాల్లో సామాన్యుల‌కే ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్పిన మంత్రి… వీఐపీల‌ను ఒకేసారి పూర్తిగా ప‌క్క‌న పెట్టడం సాధ్యం కాద‌ని తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: