ఇక‌పై బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో జ‌గ‌న్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌!

ఇక‌పై బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో జ‌గ‌న్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌!

  • ఇప్ప‌టికే ఏపీ స‌ర్కారు వ‌ద్ద రెండు బుల్లెట్ ప్రూఫ్ బ‌స్సులు
  • జిల్లాల ప‌ర్య‌ట‌ల‌ను పెంచే దిశ‌గా జ‌గ‌న్‌
  • ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో బుల్లెట్ ప్రూఫ్ బ‌స్సు అవ‌స‌ర‌మ‌న్న భ‌ద్రతా సిబ్బంది
  • ఆర్టీసీకి ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జిల్లాల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కార్ల‌తో కూడిన కాన్వాయ్‌నే వినియోగిస్తున్నారు. ఇక‌పై బుల్లెట్ ప్రూఫ్ బ‌స్సుల‌ను ఆయ‌న త‌న జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల్లో వినియోగించ‌నున్నారు. ఈ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం బుధ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో సీఎం జ‌గ‌న్ బుల్లెట్ ప్రూఫ్ బ‌స్సుల‌నే వినియోగిస్తార‌ని, ఆ దిశ‌గా బుల్లెట్ ప్రూఫ్ బ‌స్సుల‌ను ఏర్పాటు చేయాలంటూ ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశించింది.

వాస్త‌వానికి ఏపీ ప్ర‌భుత్వం వ‌ద్ద ఇప్ప‌టికే రెండు బుల్లెట్ ప్రూఫ్ బ‌స్సులున్నాయి. ఓ బుల్లెట్ ప్రూఫ్ బ‌స్సును 2009లో కొనుగోలు చేయ‌గా.. మ‌రోదానిని 2015లో కొనుగోలు చేశారు. అయితే గ‌డ‌చిన మూడేళ్లుగా జ‌గ‌న్ ఈ బ‌స్సుల వైపే చూడ‌లేదు. ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టం, జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌ను మ‌రింత‌గా పెంచే దిశ‌గా జ‌గ‌న్ సాగుతున్న నేప‌థ్యంలో ఇక‌పై బుల్లెట్ ప్రూఫ్ బ‌స్సుల్లోనే సీఎం తిర‌గాలంటూ ఆయ‌న భ‌ద్ర‌తా సిబ్బంది ప్ర‌భుత్వానికి సూచించిన‌ట్టుగా స‌మాచారం.

ఈ సూచ‌న‌ల‌తోనే బుల్లెట్ ప్రూఫ్ బ‌స్సుల కోసం ప్రభుత్వం ఆర్టీసీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న బుల్టెట్ ప్రూఫ్ బ‌స్సుల‌నే జ‌గ‌న్ వినియోగిస్తారా?  లేదంటే ఆయ‌న కోసం కొత్త‌గా బుల్లెట్ ప్రూఫ్ బ‌స్సులు కొంటారా? అన్నది తెలియాల్సి ఉంది.

Leave a Reply

%d bloggers like this: