సాయి గణేష్ హత్యపై సిబిఐ విచారణకు డిమాండ్ :ఈటల రాజేందర్!

సాయి గణేష్ హత్యపై సిబిఐ విచారణకు డిమాండ్ :ఈటల రాజేందర్!
మంత్రి పువ్వాడ అజయ్ ,ప్రసన్న వల్లనే పోలీసులు కేసులు పెట్టి వేధించారని మృతుడు గణేష్ చెప్పినా వారిపై ఎలాంటి చర్యలు లేవని విమర్శ .
రాష్ట్రంలో పాలన పడకేసింది ఆత్మహత్యలు పెరుగుతున్నాయి
అధికారం ప్రజలు ఇచ్చినట్లు కేసీఆర్ భావించడంలేదు
నిజం లాగా వారసత్వంగా వచ్చిందని అనుకుంటున్నారు
పోలీసులు అధికార పార్టీకి తప్ప న్యాయం చేయరని తేలింది.
రాష్ట్రంలో ఆత్మహత్యలపై సిబిఐ విచారణ జరగాలి
లోకల్ పోలీస్ తో న్యాయం జరగదు
పోలీసులపై ఆరోపణలు ఉంటె వారు విచారణ చేయడం ఏమిటి ?
దొంగలకు తాళం చేయి ఇచ్చినట్లుగా ఉంది
ఖ‌మ్మంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్‌… సాయిగ‌ణేశ్ కుటుంబానికి ప‌రామ‌ర్శ‌

ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ , స్థానిక కార్పొరేటర్ భర్త ప్రసన్న ప్రోద్బలంతో పోలిసుల వేధింపుల వల్లనే బీజేపీ కార్యకర్త సామినేని సాయి గణేష్ మరణించారని బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు . బుధవారం ఖమ్మం వచ్చిన ఈటల సాయి గణేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు . వారికీ బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు . మృతుడు సాయి గణేష్ చివరిసారిగా చెప్పిన మాటల్లో కూడా మంత్రి అజయ్ , ప్రసన్న ల వల్లనే తనపై పోలీసులు కేసులు పెట్టి వేధించారని చెప్పినప్పటికీ వారిపై ఇంతవరకు కేసు పెట్టకుండా ఉండటాన్ని ఈటల తప్పు పట్టారు . ఈ పోలిసుల వల్ల న్యాయం జరగదని టీఆర్ యస్ కు తొత్తులుగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని విమర్శించారు . దొంగకే తాళం ఇచ్చినట్లుగా , నేరం చేసినవారికి విచారణ జరపని చెప్పటం విడ్డురంగా ఉందని పేర్కొన్నారు . కేసీఆర్ ప్రభుత్వంలో ఇంతకన్నా ఎక్కువగా ఆశించడం అత్యేశే అవుతుందని అన్నారు . ఈ కేసును సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు .

అనేక మంది ప్రాణత్యాగాలు ఫలితంగా ఏర్పడిన తెలంగాణ లో కేసీఆర్ కుటుంబపాలన సాగిస్తూ నిజం వారసుడిలాగా భావిస్తున్నారని నిజం రాజు కు సైతం పతనం తప్పలేదని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అన్ని జిల్లాల్లో తన ప్రత్యర్థి పార్టీలను వేధించడం, అక్రమ కేసులు పెట్టడం, ఆర్థికంగా దెబ్బతీయడం తద్వారా దారికి తెచ్చుకుని అధికారం చెలాయించడం ఆయన నైజం అయిందని విమర్శించారు .

భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయండి..వారిని ఊర్లలో తిరగకుండా చేయండి నేను మీకు అండగా ఉంటా అంటూ ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు జారీ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఎలా ప్రవర్తిస్తారు, ఏం పని చేస్తారు అర్థం చేసుకోవచ్చు ఈటల అన్నారు .

సాయి గణేష్ 26 సంవత్సరాల యువకుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, స్వయంసేవక్ గా జీవితాన్ని ప్రారంభించారు. అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ, పార్టీ అనుబంధ సంఘాల లో పనిచేస్తున్నారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాంటి వ్యక్తి మీద 16 కేసులు బుక్ చేశారు. కనపడేవి 8 అయితే కనపడని కేసులు మరో ఎనిమిది ఉన్నాయి. ఈ జిల్లాలో ఏ మంత్రి పర్యటన చేసిన ముందుగా సాయి గణేష్ ను అరెస్టు చేయాలి ..పోలీస్ స్టేషన్లకు తీసుకుపోవాలి,  బూతులు తిట్టి ఆత్మగౌరవాన్ని కించపరిచి ఇబ్బంది పెట్టడం దిన చర్యగా మారిందని అన్నారు . గత కొద్ది సంవత్సరాలుగా పైసా పైసా కూడగట్టి భారతీయ జనతా పార్టీ గద్దె కడితే దానిని కూడా రాత్రికి రాత్రే కూల్చివేశారు. మంత్రి ,పోలిసుల బాధల పరంపర ఆగడం లేదని గుండె పగిలి ఆత్మహత్య చేసుకున్నారు. నా చావుకి కారణం పువ్వాడ అజయ్ కుమార్, పోలీసులు అని చెప్పి స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చినా కూడా ఇప్పటివరకు వారి మీద కేసులు నమోదు చేయలేదు. పైగా వారి కుటుంబ సభ్యులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆరోపించారు . సాయి గణేష్ ఆవేశపూరిత మనిషి అని చెప్పండి అని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత నీచపు పనికి ఒడిగడుతుంది పోలీసులు. ఇంటెలిజెన్స్ పోలీసులు వచ్చి కుటుంబాన్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ వారి అమ్మమ్మ నా మనుమడు సిద్ధాంతం కోసం త్యాగం చేశాడు అతని గురించి అలా చెప్పను అని తెగేసి చెప్పిందని ఈటల అన్నారు .

కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ముస్తఫా మీద కూడా కేసులు పెట్టడమే కాకుండా రౌడీషీటర్ ఓపెన్ చేసి  ఆరు నెలల పాటు జైలులో పెట్టారు. ఇలా అన్ని పార్టీల వారి మీద అనేకమంది నాయకులు మీద చివరికి  సొంత పార్టీలో ఉన్న వారి మీద కూడా కేసులు పెడుతున్నారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకుంటే వారి మీద కూడా కేసులు పెడుతున్నారు. ఎమ్మెల్యే కి వ్యతిరేకంగా ఉన్నారు అని  డిసిసిబి చైర్మన్ విజయబాబు మీద కేసులు పెట్టారు అంటే అర్థం చేసుకోండి ఎంతటి దుర్మార్గపు చర్యలు కొనసాగుతున్నాయి ఇక్కడ అని పేర్కొన్నారు .

నిన్న కుటుంబ సభ్యులతో కలిసి కెసిఆర్ నీ కలిస్తే చాల  గొప్పగా  పాలిస్తున్నావని అజయ్ కి సీఎం ఆశీర్వాదం ఇచ్చారంట. 2023లో ఖమ్మం జిల్లాలో మీ అడ్రస్ గల్లంతు అవుతుంది. మీ తాత జాగీరు కాదు. అనేక మంది కాల గర్భంలో కలిసిపోయారు. చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఈటల తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు .

ఖమ్మం లో సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్!

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ తెలంగాణ‌లోని ఖమ్మం చేరుకున్నారు. ఇటీవ‌లే ఆత్మ‌హ‌త్య చేసుకున్న బీజేపీ కార్య‌కర్త సాయి గ‌ణేశ్ కుటుంబాన్ని ఆయ‌న పరామ‌ర్శించారు. టీఆర్ఎస్ నేత‌లు, పోలీసుల వేధింపుల కార‌ణంగా సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన‌ట్లుగా బీజేపీ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఆత్మ‌హ‌త్యాయ‌త్నం త‌ర్వాత ఆసుప‌త్రికి త‌ర‌లించగా…అక్క‌డ చికిత్స పొందుతూ సాయి గ‌ణేశ్ మృతి చెందాడు.

ఈ ఘ‌ట‌న‌పై బీజేపీ తెలంగాణ శాఖ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ బుధ‌వారం నాడు త‌న పాద‌యాత్ర‌కు విరామం ఇచ్చి దీక్ష‌కు దిగారు. ఇదిలా ఉంటే… ఇప్ప‌టికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా సాయి గ‌ణేశ్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ప‌రామ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

%d bloggers like this: