Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

హాస్టల్‌ను బార్‌గా మార్చిన విద్యార్థులు….

హాస్టల్‌ను బార్‌గా మార్చిన విద్యార్థులు…
-చక్కగా బీరు ,బిర్యానీతో పార్టీ చేసుకున్న విద్యార్థులు
-సోషల్ మీడియాలో విషయం చక్కర్లు కొట్టడంతో కలెక్టర్ ఆగ్రహం
-విచారణకు ఆదేశం …సంబంధిత అధికారులపై చర్యలకు సమాయత్తం

మంచిర్యాల జిల్లాలోని బీసీ హాస్టల్‌లో ఫేర్వెల్ పార్టీలో విద్యార్థులు మందు తెచ్చుకుని చిందేసిన ఘటన కలకలం సృష్టించింది. హాస్టల్ లో ఎంచక్కగా మందు బాటిల్స్ ముందు పెట్టుకొని దర్జాగా చుట్టుకుర్చోని మందుకొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టడం జిల్లా అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. దీనికి సంబంధించిన ఫొటోలు బయటికి రావడంతో అధికారులు విచారణ చేపట్టారు

మంచిర్యాల జిల్లా దండేపల్లి బీసీ హాస్టల్‌లో విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఫేర్వెల్ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో విద్యార్థులు బీరు , బిర్యాణి తెచ్చుకుని ఎంజాయ్ చేస్తూ.. హాస్టల్‌ను ఏకంగా బార్‌గా మార్చేశారు.

ఇందులో ఇలా జరగడం ఇది మొదటిసారి మాత్రమే కాదని, ఎన్నోసార్లు జరిగిందని పలువురు చెబుతున్నారు. విద్యార్థులు బీరు తాగుతూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు జరిగిన విషయం పై విచారణ ప్రారంభించారు. విచారణ కోసం అసిస్టెంట్ బిసి డెవలప్మెంట్ అధికారిణి భాగ్యవతి హాస్టల్ తనిఖీ చేసి విచారణ ప్రారంభించారు.

హాస్టల్ వార్డెన్, సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఇలా జరుగుతోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు . వెంటనే విశారనకు ఆదేశించిన కలెక్టర్ సంబంధిత అధికార్లుపై చర్యలకు సమాయత్తం అయినట్లు సమాచారం .

Related posts

400 కిలోల టమాటా ఎత్తుకెళ్లిన దొంగలు, కేసు నమోదు…

Drukpadam

సహజీవనంపై ఇండోనేసియా నిషేధం.. ఉల్లంఘిస్తే జైలుకే!

Drukpadam

ఒకరినొకరు కాపాడే ప్రయత్నంలో నీటమునిగి ఐదుగురు టీనేజర్ల దుర్మరణం!

Drukpadam

Leave a Comment