మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ రవినాయక్ దారుణ హత్య!

మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ రవినాయక్ దారుణ హత్య!
-గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు ,గొడ్డళ్లతో విచక్షణారవితంగా నరికి చంపారు
-అక్కడనుంచి దుండగులు పరారైయ్యారు
-దాడి సమయంలో రవినాయక్ ఒంటరిగానే ఉన్నారు
-రవినాయక్ ను చుసిన కొంతమంది ఆంబులెన్స్ కు కాల్ చేశారు
-హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ..అప్పటికే రవినాయక్ -మృతిచెందినట్లు డాక్టర్లు నిర్దారించారు .

 

మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్ మున్సిపల్ వార్డు కౌన్సిలర్ బానోతు రవినాయక్ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో మహబూబాబాద్ పట్టణంలోని పత్తిపాక ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. దాడి జరిగిన సమయంలో రవినాయక్ ఒక్కరే ఉన్నారు . గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై గొడ్డళ్లు ఇతర మారణాయుధాలతో దాడిచేసి అక్కడ నుంచి పారిపోయారు . ఘటన జరిగిన కొద్దిసేపటికి ఆప్రాంతానికి వచ్చినవారు చూసి అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు .

పత్తిపాకలో నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి పనులను పరిశీలించేందుకు వెళ్లిన రవినాయక్ పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ దాడి సమయంలో రవినాయక్ ఒంటరిగా ఉన్నాడు. దాడి చేసిన అనంతరం దుండగులు పరార్ అయ్యారు. స్థానికులు రవినాయక్ ను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రవినాయక్ ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. రవినాయక్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

తనకు ప్రాణహాని ఉందని కూడా స్వయంగా కొంతమంది తన సన్నిహితులతో రవినాయక్ పేర్కొన్నట్లు సమాచారం. ఈక్రమంలోనే రవినాయక్ హత్యకు గురికావడం గమనార్హం. రవినాయక్ కు భార్య పూజ ఇద్దరు పిల్లలున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు

Leave a Reply

%d bloggers like this: