పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటన వాయిదా …

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటన వాయిదా …
అధికారికంగా ప్రకటించిన జిల్లా కాంగ్రెస్
త్వరలో పర్యటిస్తారన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్
రాహుల్ బహిరంగసభ జయప్రదం చేయాలనీ విజ్ఞప్తి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం ఖమ్మం లో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలవల్ల అది వాయిదా పడినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ప్రకటించారు . పనుల వత్తిడి కారణంగానే రేవంత్ రెడ్డి పర్యటన వాయిదా పడిందని ఎప్పడు ఖమ్మం వచ్చేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు . మే నెల 6 వ తేదీన రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారని అదే రోజు వరంగల్ లో రైతు సంఘర్షణ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు . సభకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు . లక్షలాది మందితో బహిరంగ సభను జయప్రదం చేసేందుకు కృషి జరుగుతుందని సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించేందుకు పీసీసీ అధ్యక్షడు వరంగల్ లో పర్యటించారని అన్నారు . ఖమ్మం పర్యటన త్వరలో ఉంటుందని అన్నారు .

మధిర నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి పాదయాత్రకు ప్రజలనుంచి విపరీతమైన ఆదరణ లభిస్తుందని ప్రతి గ్రామంలో ప్రజలు తమ సమస్యలను భట్టికి చెప్పుకుంటున్నారని , దరఖాస్తులు కూడా అందజేస్తున్నారని పేర్కొన్నారు .

 

Leave a Reply

%d bloggers like this: