ఖమ్మంలో సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ ఎంపీ సాయం బాబురావు!

ఖమ్మంలో సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ ఎంపీ సాయం బాబురావు!
-కుటుంబానికి బీజేపీ అందగాఉంటుందని ఉద్ఘాటన
-మంత్రి అజయ్ , కార్పొరేటర్ భర్తపై కేసు నమోదు చేయాలి
-సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్

ఇటీవల ఖమ్మం లో ఆత్మహత్య గురైన బీజేపీ యువనేత సాయి గణేష్ కుటుంబాన్ని ఆదిలాబాద్ కు చెందిన బీజేపీ ఎంపీ సాయం బాబురావు గురువారం పరామర్శించారు . బీజేపీ రాష్ట్ర నాయకులూ యండల లక్ష్మి నారాయణతో కలిసి వచ్చిన బాబురావు జిల్లాకు చెందిన రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి , జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ , ఇతర నాయకులతో కలిసి సాయి గణేష్ ఇంటికి వెళ్లి వారిని కుటుంబసభ్యులను పరామర్శించారు .

ఈ సందర్భంగా తమకు జరిగిన అన్యాయాన్ని గణేష్ అమ్మమ్మ , చెల్లెలు ఎంపీ కి వివరించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ గణేష్ ను టీఆర్ యస్ ప్రభుత్వం దారుణంగా పొట్టన పెట్టుకున్నాడని విమర్శించారు . సెంటర్ లో ఎలాంటి విగ్రహం పెట్టవద్దని అన్నందుకు మంత్రి కేసులు పెట్టించి వేదించినందునే ఆత్మహత్య కు పాల్పడ్డారని దీనికి మంత్రి అజయ్ స్థానిక కార్పొరేటర్ భర్త ప్రసన్న ప్రోద్బలంతో కేసులు పెట్టించి ఆత్మహత్యకు కారణం అని సాయి గణేష్ తెలిపినప్పటికీ వారికీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దారుణమని బాబురావు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు తావు లేదని అందువల్ల సరైన విచారణ జరగాలంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు .

Leave a Reply

%d bloggers like this: