Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

తెలంగాణలో కంట్రోల్‌లోనే క‌రోనా-హెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాస్ రావు…

తెలంగాణలో కంట్రోల్‌లోనే క‌రోనా-హెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాస్ రావు…
-పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి
-ఫోర్త్ వేవ్ కు అవకాశం లేదు …కానీ పెళ్లిళ్లు అధికంగా ఉన్నాయి
-ప్రయాణాలు చేయవచ్చు …వాక్సిన్ తీసుకోని వారు తప్పనిసరిగా తీసుకోవాలి
-మాస్కు ధ‌రించ‌క‌పోతే రూ. 1000 పైన్

రాష్ట్రంలో క‌రోనా పూర్తిగా కంట్రోల్‌లోనే ఉంది.. కానీ ప‌క్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ధ‌రించాల్సిందేన‌ని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు డాక్ట‌ర్ శ్రీనివాస్ రావు స్ప‌ష్టం చేశారు. మాస్కు ధ‌రించ‌క‌పోతే రూ. వెయ్యి జ‌రిమానా విధిస్తామ‌ని చెప్పారు. ఇత‌ర రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్ర‌మంలో శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ వ్యాప్తంగా ఈ రెండు నెల‌ల్లో భారీ సంఖ్య‌లో పెళ్లిళ్లు ఉన్న నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు. సీరో స‌ర్వే ప్ర‌కారం తెలంగాణ‌లో ఫోర్త్ వేవ్ రాద‌ని స్ప‌ష్టం చేశారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌తి వ్య‌క్తి మాస్కు ధ‌రించ‌డంతో పాటు, అర్హులైన వారు వ్యాక్సిన్ తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో కొవిడ్‌ను నియంత్రించ‌గ‌లిగాం. రాబోయే రోజుల్లో కూడా ప్ర‌జ‌ల స‌హ‌కారం అవ‌స‌రం ఉంటుంద‌న్నారు. గుంపులు, స‌మూహల్లో ఉన్న‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాలి. రాష్ట్రంలో క‌రోనా కంట్రోల్‌లో ఉండ‌టానికి కార‌ణం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌నే అని స్ప‌ష్టం చేశారు.

క‌రోనాను పూర్తిగా నిరోధించ‌గ‌లిగాము..
రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా తీసుకున్న జాగ్ర‌త్త‌ల వ‌ల్ల క‌రోనాను పూర్తిగా నిరోధించ‌గ‌లిగామని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఢిల్లీ, హ‌ర్యానా, యూపీతో పాటు ప‌క్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ప్ర‌తి ఒక్క‌రూ స్వీయ జాగ్ర‌త్త‌లు పాటించాలి. పెళ్లిళ్లు, ఇత‌ర ఫంక్ష‌న్లు, ప్ర‌యాణాల‌ను చేసుకోవ‌చ్చు.. కానీ మాస్కు ధ‌రించాలి. వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫోర్త్ వేవ్ నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే మాస్కు, వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రి అని స్ప‌ష్టం చేశారు.

కేంద్రం ఆదేశాల ప్ర‌కారం.. 60 సంవ‌త్స‌రాల పైబ‌డిన వ్య‌క్తులంద‌రికీ ప్ర‌తి ప్ర‌భుత్వ ఆరోగ్య కేంద్రంలో బూస్ట‌ర్ డోసు ఇస్తున్నామ‌ని తెలిపారు. రెండో టీకా తీసుకొని 9 నెల‌లు పూర్త‌యిన వారు మూడో డోసు తీసుకోవాల‌ని సూచించారు. 12 నుంచి 17 ఏండ్ల వ‌య‌సున్న పిల్ల‌లు రెండో డోసు తీసుకోవాలి. 18-59 ఏండ్ల వ‌య‌సు వారికి ఉచితంగా బూస్ట‌ర్ డోసు పంపిణీకి కేంద్రంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంప్ర‌దింపులు జ‌రుపుతుంద‌ని డీహెచ్ శ్రీనివాస్ రావు వెల్ల‌డించారు..!!

Related posts

కరోనా విమానం ….179 మంది ప్రయాణికుల్లో 125 మందికి కరోనా !

Drukpadam

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కరోనా పాజిటివ్!

Drukpadam

జనం కరోనా తో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రాజకీయక్రీడ ఆడుతున్నారు… సీఎల్పీ నేత భట్టి

Drukpadam

Leave a Comment