ఉత్తమ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా నేలకొండపల్లి ఎస్ ఐ స్రవంతి..

ఉత్తమ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా నేలకొండపల్లి ఎస్ ఐ స్రవంతి..
-ఎస్సై స్రవంతి ని అబినందించిన సిపి విష్ణు ఎస్ వారియర్
-పలువురు పోలీస్ అధికారులు …

జిల్లాలోనే ఉత్తమ ఎస్ హెచ్ ఓ గా నిలిచిన నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్రవంతి ని సిపి విష్ణు ఎస్ వారియర్ అబినందించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో లో జరిగిన రివ్యూ మీటింగ్ లో అడిషనల్ డిసిపి లు గౌస్ ఆలాం, శుభాస్ చంద్రబోస్ తో కలిసి ఎస్సై స్రవంతిని అభినందించారు.

ఈ ఏడాది జనవరిలో ఉత్తమ పౌరసేవలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, విఐపి లకు భద్రత కల్పించడం, రోడ్డు ప్రమాదాల నివారణ, నేరపరిశోదన, మహిళా భద్రత, ఎస్సీ. ఎస్టీ ల కేసులకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేయడం, ట్రాఫిక్ కంట్రోల్ తదితర అంశాలకు సంబంధించి ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను నేలకొండపల్లి ఎస్సై స్రవంతి ని ఉత్తమ ఎస్ హెచ్ ఓ గా ఎంపిక చేయడం జరిగింది.

పలువురు హర్షం

నేలకొండపల్లి ఎస్సై స్రవంతి జిల్లాలోనే ఉత్తమ ఎస్ హెచ్ ఓ గా ఎంపిక కావడం పట్ల ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వీరెడ్డి, కూసుమంచి సిఐ సతీష్,నేలకొండపల్లి ఏ ఎస్సై రాఘవయ్య, కొడెత్రాసు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

%d bloggers like this: