Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖబర్దార్ రేణుక చౌదరి పువ్వాడపై ఆరోపణలు చేస్తావా ? టీఆర్ యస్ కు చెందిన ఖమ్మం మేయర్ కార్పొరేటర్లు!

ఖబర్దార్ రేణుక చౌదరి పువ్వాడపై ఆరోపణలు చేస్తావా ? టీఆర్ యస్ కు చెందిన ఖమ్మం మేయర్ కార్పొరేటర్లు
మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి పై విమర్శల వర్షం
మళ్ళీ జోలికివస్తే మా తడాఖా చూపిస్తాం ….

ఇంకా ఎన్నాళ్లు ఈ శవ రాజకీయాలు..
ఇన్నాళ్ళు ఏమైపోయావమ్మ బొమ్మ..
వలసపక్షిలా వచ్చి పోయే నువ్వా మాట్లాడేది..
ప్రజలపై అంత ప్రేమ ఉన్నదానివి కోవిడ్ సమయంలో ఏమైపోయావు

ఖమ్మం జిల్లాలో అభివృద్ధిని మరిచి కేవలం శవ రాజకీయాల్లో అందివచ్చిన చెయ్యి రేణుక చౌదరి ది అని, మళ్ళి ఖమ్మంలో దానికి తెరలేపారని మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు.

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిపై రేణుక చౌదరి చేసిన వ్యాఖ్యలకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో మేయర్, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులతో మీడియా సమావేశం నిర్వహించారు.

డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, AMC చైర్మన్ లక్ష్మి ప్రసన్న, కార్పొరేటర్లు పాలెపు విజయ, కొత్తపల్లి నీరజ, రుద్రగాని దేవి, రావూరి కరుణ, ధనాల రాధ, మోతారపు శ్రావణి, సరిపుడి రమాదేవి, పాకాలపాటి విజయ నిర్మల, దొన్వాన్ సరస్వతి, పైడిపల్లి రోహిణి, పగడాల శ్రీవిద్య, తోట ఉమారాణి, కొల్లు పద్మ, బానోత్ ప్రమీల తదితరులు ఉన్నారు.

ప్రశాంతంగా ఉన్న ఖమ్మంలో కొంతమంది దుష్టశక్తులు చేరి అభివృద్ధి ప్రదాత అయిన మంత్రి పువ్వాడ పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు యదాద్రి దేవాలయంకు ఖమ్మం జిల్లా ప్రజల తరుపున కీలో బంగారం కానుకగా ఇచ్చిన విషయాన్ని రాజకీయం చేస్తున్నావు అందుకు సిగ్గుపడాలన్నరు.

దేవుడికి ఇస్తున్న కానుకను రాజకీయం చేస్తు, వాటిని మీకు అనుకూలంగా మార్చుకుని ఆరోపణలు చేయడం నేచమన్నరు.

నీకు ఇవ్వడం చేతకాదు.. కేవలం తీసుకోవడమే తెలుసు.

మంత్రి పువ్వాడ దేవుడికి కిలో బంగారం ఇస్తే దాన్ని హాస్యం చేస్తారా..? పాపాలు చేసి దేవుడికి బంగారం ఇస్తే చేసిన పాపాలు పోతాయా అని అంటున్నావు.. మీ స్వార్థం కొసం దేవుడిని కూడా లగుతారా.. అని ప్రశ్నించారు.

మంత్రి కేటిఆర్ గారికి అజయ్ గారికి ఉమ్మడి వ్యాపారాలు ఉన్నాయని ఆరోపణలు చేసే ముందు ఒక సారి ఆలోచించి మాట్లాడితే బావుంటుందని అన్నారు. మతి భ్రమించి మాట్లాడుతున్నావని అర్థమవుతుంది. ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇద్దరికి ఏలాంటి వ్యాపార లావాదేవీలు లేవన్న విషయం తెలుసుకోవాలి.. అని హితువు పలికారు.

అసలు ఎం మాట్లాడుతున్నావువో నీకు సోయి ఉందా అని ఎద్దేవా చేశారు. అవినీతి అక్రమాల గురించి నువ్వా మాట్లాడేది.. అలా మాట్లాడాల్సి వస్తే నీ గురించి ఒక పోస్తకమే రాయొచ్చునని అన్నారు.

గిరిజన బిడ్డ రాంజీ నాయక్ వద్ద కోటి రూపాయలు తీసుకుని వారి చావుకు కారణం అయింది నువ్వు కాదా..? సాటి అడదానివై ఉండి వారి కుటుంబం మీద అక్రమ కేసులు పెట్టించించింది నువ్వు కాదా.. తరువాత వారికుటుంబంతో బేరసారాలకు దిగింది నువ్వూ కాదా..? రాంజీ కీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ ఇప్పిస్తా అని చెప్పి మళ్ళి అదె సీటును వేరే వాళ్లకు అమ్ముకొలేదా…

కేసులు పెట్టాల్సి వేస్తే నువ్వు, నీ కూతురు, అల్లుడు హైద్రాబాద్ లో నడుపుతున్న పబ్లో చట్ట వ్యతిరేకంగా డ్రగ్స్ అమ్మిస్తు, అర్ధరాత్రి వరకు చట్టవ్యతిరేక పనులు చేస్తు యువత ను డ్రగ్స్ కు బానిసలను చేస్తు వారి భవిష్యత్ ను చిన్నా బిన్నం చేస్తున్న మీ అందరిపై పెట్టాలి ముందు కేసులు అని వెల్లడించారు.

ముస్తఫా మీద అనేక మార్లు నువ్వే కేసులు పెట్టించిన విషయం మరిచిపోయావా.. ఇప్పుడు ప్రేమలు పుట్టుకొచ్చాయా రేణుకమ్మ.. కేవలం నీ స్వార్థం కోసం రాజకీయాలను వాడుకుని ప్రజలకు మంచి చేస్తున్నట్లు నటించడం నీకు వెన్నే తో పెట్టిన విద్య అని అన్నారు.

సాయి గణేష్ ఆత్మహత్యను మీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని పబ్బం గడుపుకోవాలని చూడటం సిగ్గుచేటన్నారు. అసలు సాయి గణేష్ ఆత్మహత్యకు మంత్రి కి ఏం సంబంధం ఉందో చెప్పాలన్నారు. కేసులు ఉన్న వివిధ రాజకీయ నాయకుల ఎందుకు ఆత్మహత్యలు చేసుకొట్లేదు…? అలా అయితే కేసులు ఉన్న ప్రతి నాయకుడు ఆత్మహత్యలు చేసుకున్నారా..? సాయి గణేష్ మాత్రమే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో చెప్పాలన్నారు. సాయి కేవలం క్షణికావేశంలో చేశాడని, బిజేపి నాయకులే ప్రేరేపించి ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు.దాన్ని మంత్రి పువ్వాడ కు అంటగట్టడం సిగ్గుచేటన్నారు. రాజకీయ అభివృద్ధిని చుసి ఓర్వలేకనే బట్ట కాల్చి మీద వేస్తున్నారని స్పష్టంగా కనబడుతుందన్నరు.

ఖమ్మం కు చట్టం చుపులా l, వలస పక్షిలా వచ్చిపోయే రేణుకా చౌదరి ఖమ్మం ప్రజలపై చూపిస్తున్న ప్రేమ పట్ల ఆశ్చర్యంగా ఉందన్నారు. అంత ప్రేమ ఉన్నదానివి కోవిడ్ క్లిష్టపరిస్థితుల్లో ఏమైపోయావు అని ప్రశ్నించారు. ఖమ్మం నగరం ఒకానొక సందర్భంలో క్లిష్ట పరిస్థితులు సంభవిస్తే ఆ నాడు తమరు ఏమైపోయారు, అప్పుడు గుర్తుకు రాలేదా నీ కవచ కుండలు.. శవాల మీద పేలాలు ఎరుకోవడనికి వచ్చావా ఇప్పుడు.. ఏ మొహం పెట్టుకొని వచ్చావో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్న వ్యక్తి పై ఆరోపణలు చేసి హీరోలు కావాలని చూస్తే తెరాస శ్రేణులు చూస్తూ ఊరుకోరన్నారు.

అనంతరం రేణుక చౌదరి దిష్టి బొమ్మతో శవయాత్ర నిర్వహించి ఇల్లందు సర్కిల్లో దహనం చేశారు.

రేణుకా చౌదరి పై బిక్కసాని ప్రశాంత లక్ష్మి ఫైర్

మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి పై తెరాస మహిళ నేత, కార్పొరేటర్ బిక్కసాని ప్రశాంత లక్ష్మి ఫైర్ అయ్యారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులను ఉద్దేశించి రేణుకా చౌదరి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఖమ్మం లో ఐటీ హబ్ నిర్మించి యువతకు ఉపాధి చూపిన ఘనత పువ్వాడదైతే .. పబ్ లు నడుపుతూ హైదరాబాద్ లో యువత జీవితాలను దుర్భరం చేస్తున్న ఘనత రేణుకా కుటుంబానికే దక్కుతుందన్నారు. పేదల కోసం ప్రభుత్వానికి 25 ఎకరాల తన సొంత భూమిని వితరణ చేసిన మంత్రిపై ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి కోళ్ల ఫోరమ్ లను నిర్మించుకున్న ఈటెల రాజేందర్ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఢిల్లీ పవర్ బ్రోకర్ వలె నీచమైన శవ రాజకీయాలు చేసిన రేణుకా చౌదరి కి పువ్వాడను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. వందల కోట్ల భూములను కేంద్ర మంత్రిగా దోచుకున్న దేశంలోనే భూముల నంబర్ వన్ బ్రోకర్ రేణుకా చౌదరి అని బిక్కసాని ప్రశాంత లక్ష్మి మండిపడ్డారు.

Related posts

అసదుద్దీన్ ప్రయాణిస్తున్న రైలుపై దాడి…నిజం కాదంటున్న గుజరాత్ పోలీసులు !

Drukpadam

మళ్లీ టీడీపీలో చేరుతున్నారనే వార్తలపై శిల్పా చక్రపాణిరెడ్డి క్లారిటీ!

Drukpadam

రోడ్డు వేయలేదో.. ఆ ఎమ్మెల్యే మా చేతుల్లో చచ్చినట్టే: యూపీలో మహిళల హెచ్చరిక!

Drukpadam

Leave a Comment