లాలూ ప్రసాద్ కు బెయిల్ మంజూరు…

లాలూ ప్రసాద్ కు బెయిల్ మంజూరు…

  • బెయిల్ మంజూరు చేసిన ఝార్ఖండ్ హైకోర్టు
  • ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు
  • డొరండ ట్రెజరీ కేసులో లాలూకు శిక్ష విధించిన సీబీఐ కోర్టు

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ మంజూరయింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. డొరండ ట్రెజరీ కేసులో గతంలో సీబీఐ కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ, లూలూకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు.

ఆరోగ్య సమస్యలతో పాటు సగం శిక్షా కాలం జైల్లో గడపడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని లాలూకు ఊరటను కలిగించిందని తెలిపారు. రూ. 10 లక్షల జరిమానా, రూ. 1 లక్ష విలువైన పూచీకత్తును సమర్పించాలని ఆదేశించినట్టు చెప్పారు.

Leave a Reply

%d bloggers like this: