Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్య‌ వ్యవహారంలో మంత్రి పువ్వాడ‌కు హైకోర్టు నోటీసులు!

సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్య‌ వ్యవహారంలో మంత్రి పువ్వాడ‌కు హైకోర్టు నోటీసులు!
కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కూ నోటీసుల జారీ
రెండు వారాల్లోగా స్పందించాల‌ని హైకోర్టు ఆదేశం
విచార‌ణ‌ను రెండు వారాల‌కు వాయిదా వేసిన న్యాయస్థానం

ఖ‌మ్మం బీజేపీ కార్య‌క‌ర్త సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్య వ్య‌వ‌హారంలో తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్‌కి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాల‌కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా ఆ నోటీసుల‌కు స్పందించాల‌ని హైకోర్టు పేర్కొంది. ఈ మేర‌కు సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్య‌పై సీబీఐ దర్యాప్తును కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌పై శుక్ర‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. విచార‌ణ‌ను ఒక వారానికి వాయిదా వేసింది.

అధికార టీఆర్ఎస్ నేత‌ల ప్రోత్సాహంతో పోలీసులు త‌న‌పై కేసులు న‌మోదు చేసి వేధిస్తున్నార‌ని చెబుతూ సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని బీజేపీ వాదిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్య‌కు దారితీసిన కార‌ణాల‌ను వెలికితీయ‌డంతో పాటు అందుకు బాధ్యులెవ‌ర‌నే విష‌యంపైనా నిజాల‌ను నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచార‌ణకు ఆదేశాలు ఇవ్వాల‌ని బీజేపీ నేత‌లు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.దీనిపై రాష్ట్ర హైకోర్టు స్పందించింది . పువ్వాడ పాటు త్రి టౌన్ , టూటౌన్ ఎస్ ఎచ్ ఓ లకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది హైకోర్టు . ఇప్పుడు ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కేంద్రప్రభుత్వం దీనిపై చాల సీరియస్ గా ఉంది. స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సాయి గణేష్ కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారంటే అర్థం చేసుకోవచ్చు . ఇప్పటికే అనేక మంది బీజేపీ నేతలు వచ్చి సాయి గణేష్ కుటుంబసభ్యులను పరామర్శించి మీకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు . కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఖమ్మం చేరుకొని కుటుంబసభ్యులను పరామర్శించారు . అటు కోర్ట్ నోటీసులు ఇటు బీజేపీ వత్తిడి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఆశక్తిగా మారింది.

Related posts

చనిపోతే ‘జై జవాన్’ అనడం కాదు.. మా భార్య పిల్లలు భూములకు రక్షణ కల్పించండి

Drukpadam

రఘురామకృష్ణరాజుకు ఈ నెల 28 వరకు రిమాండ్…

Drukpadam

పాకిస్థాన్ లో భారీగా పెరిగిన వంట గ్యాస్ ధర..కట్టెల పొవ్వి వైపు ప్రజల దృష్టి!

Drukpadam

Leave a Comment