Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీలో కమ్మ మంత్రిని పీకేశారు.. తెలంగాణలో ఏకైక కమ్మ మంత్రినైన నాపై కుట్రలు:పువ్వాడ సంచలన వ్యాఖ్యలు!

ఏపీలో కమ్మ మంత్రిని పీకేశారు.. తెలంగాణలో ఏకైక కమ్మ మంత్రినైన నాపై కుట్రలు:పువ్వాడ సంచలన వ్యాఖ్యలు!
సాయి గణేష్ ఆత్మహత్య పై ఎట్టకేలకు స్పందించిన పువ్వాడ
సాయి గణేష్ ఆత్మహత్య చిన్న సంఘటన అన్న మంత్రి
మొదటిసారిగా కులప్రస్తావన తెచ్చిన మంత్రి పువ్వాడ
వైరా కమ్మ  ఏసీ కల్యాణ మండపం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి
సాయి గణేశ్ ఆత్మహత్య నేపథ్యంలో పువ్వాడపై ఆరోపణలు
చిన్న ఘటనను అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారన్న పువ్వాడ
కుట్రలు చేస్తున్న వారితో చాలా మంది చేతులు కలిపారని వ్యాఖ్య

ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ మొదటిసారిగా కులప్రస్తావన తెచ్చారు . గత 8 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్న అజయ్ ఏ నాడు బహిరంగంగా కులప్రస్తావన తీసుకురాలేదు . ఖమ్మం లో సాయి గణేష్ ఆత్మహత్య విషయంలో తనపై కుట్రలు జరుగుతున్నాయని , ఏపీ ఉన్న ఏకైక కమ్మ మంత్రిని పీకేశారని , ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక కమ్మ మంత్రిని తానేనని తనపై కుట్రలు జరుగుతున్నాయని వాపోయారు . వైరా కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఏసీ కమ్మ కల్యాణ మండపం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు . ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు మంత్రి పువ్వాడ చేయడం విశేషం.

ఖమ్మంకు చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య అంశం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాయి గణేశ్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. దీనికి కారణం మంత్రి పువ్వాడ అజయే అని… ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్ బర్తరఫ్ చేసి, కేసు నమోదు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పువ్వాడ మాట్లాడుతూ, ఖమ్మంలో చిన్న ఘటన జరిగితే దాన్ని అడ్డం పెట్టుకుని తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కుట్రలు చేస్తున్న వారితో చాలా మంది చేతులు కలిపారని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక కమ్మ మంత్రిని తానే అని అన్నారు. ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కమ్మ వారికి ఉన్న ఏకైక మంత్రి పదవిని పీకేశారని చెప్పారు.

Related posts

వైసీపీకి షాక్ …. లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన ఆనం రాంనారాయణ రెడ్డి కూతురు కైవల్యా!

Drukpadam

ఏపీలో పరిస్థితులు దిగజారిపోయాయి…చర్యలు తీసుకోండి రాష్ట్రపతి ,ప్రధానికి చంద్రబాబు లేఖ …

Ram Narayana

ఓటమిని అంగీకరించిన రాములు నాయక్

Drukpadam

Leave a Comment