Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దత్తపుత్రుడు అనే మాటపై ఘాటుగా స్పదించిన పవన్ కళ్యాణ్!

దత్తపుత్రుడు అనే మాటపై ఘాటుగా స్పదించిన పవన్ కళ్యాణ్!
-చంచల్ గూడ జైలు లో షటిల్ ఆదుకున్న వాళ్ళా నీతులు చెప్పేది అని మండిపాటు
-సీఎం జ‌గ‌న్‌, వైసీపీల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ విమ‌ర్శ‌లు
-చింత‌ల‌పూడిలో కౌలు రైతు కుటుంబాల‌కు ఆర్థిక సాయం
-వైసీపీ అంటే త‌న‌కేమీ ద్వేషం లేద‌న్న ప‌వ‌న్‌
-సొంత‌వాళ్లు ఉండ‌గా నేనెందుకు ద‌త్త‌త వెళ‌తాన‌ని ఆగ్ర‌హం
-మ‌రోసారి ఆ మాటంటే తానూ అనాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిక‌

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తనను తరచూ దత్తపుత్రుడు అంటూ విమర్శలు చేయడంపై
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీలో అధికార పార్టీ వైసీపీ.పైనా, ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపైనా ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ఇప్పటివరకు భరించాను నాకు ఎవరు లేకపోతె దత్తత వెళతాను అందరు ఉన్నారు . దత్తత పోవాల్సిన అవసరం నాకు లేదు .జగన్ రెడ్డి తనను మాటిమాటికి దత్తపుత్రుడు అంటున్నారు . నేను కూడా అనగలను సిబిఐ దత్తపుత్రుడు అని చంచల్ గూడ జైల్లో షటిల్ ఆడలేదు . నన్ను రెచ్చగొట్టవద్దు .నాకు వైసీపీ అంటే ద్యేశం లేదు వారు ఇచ్చిన హామీల గురించి అడిగటం నేరమా ? తప్పా అని ప్రశ్నించారు .

శ‌నివారం పశ్చిమ గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతున్న‌ జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా చింతలపూడిలో నిర్వ‌హించిన‌ రచ్చబండ కార్యక్రమంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని ప‌వ‌న్‌ అందజేశారు.ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ప‌వ‌న్‌… వైసీపీపై విమ‌ర్శ‌లు సంధించారు.

వైసీపీపై త‌న‌కు ఎలాంటి ద్వేషం లేద‌న్న ప‌వ‌న్‌… వైసీపీ నేత‌లు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌క‌పోతే మాత్రం త‌ప్ప‌నిస‌రిగా నిల‌దీస్తామ‌ని తెలిపారు. త‌న‌ను ప‌దే ప‌దే ద‌త్త‌పుత్రుడు అంటూ ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్న ఏపీ సీఎంపై ప‌వ‌న్ విరుచుకుప‌డ్డారు. త‌న‌ను మ‌రోమారు ద‌త్త‌పుత్రుడు అని అంటే సీబీఐ ద‌త్త‌పుత్రుడు అని మిమ్మల్ని అనాల్సి వ‌స్తుంద‌ని ప‌వ‌న్ అన్నారు. త‌న‌కు సొంత వాళ్లు ఉన్న‌ప్పుడు తాను ఎవ‌రి వ‌ద్ద‌కో ద‌త్త‌త వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌వ‌న్ అన్నారు. అయినా చంచ‌ల్ గూడ జైల్లో ష‌టిల్ ఆడుకున్న వాళ్లా నాకు చెప్పేది అంటూ జ‌గ‌న్ పేరును ప్ర‌స్తావించ‌కుండానే ప‌వ‌న్ ఆరోప‌ణ‌లు గుప్పించారు.

Related posts

మాజీ ఎంపీ పొంగులేటికి గులాబీ పార్టీ షాక్ …

Drukpadam

అధికారంలోకి రాగానే రూ.500కే గ్యాస్…

Drukpadam

పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు తక్షణమే రద్దు చేయాలి: జనసేన

Drukpadam

Leave a Comment