రాహుల్ గాంధీ సభకు పెద్దఎత్తున జన సమీకరణ జరగాలి..సీఎల్పీ నేత భట్టి!

రాహుల్ గాంధీ సభకు పెద్దఎత్తున జన సమీకరణ జరగాలి..సీఎల్పీ నేత భట్టి
నౌ ఆర్ నెవర్ లా సభకు జనం రావాలి.. డూ ఆర్ డై లాగా నాయకులు పనిచేయాలి.

వరంగల్ లో జరుపతలపెట్టిన రాహుల్ సభను గతంలో ఎన్నడూ జరగనిరీతిలో జయప్రదం చేయాలనీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపు నిచ్చారు . రైతుల సమస్యలపై ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైఖరిని , బీజేపీ ,టీఆర్ యస్ ల డ్రామాలను రాహుల్ సభ ద్వారా వివరిస్తారని అందువల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో రైతులను సమీకరణ చేయాలనీ ,అందుకు తగ్గట్లు ప్లాన్ చేసుకోవాలని కోరారు . వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీ ,టీఆర్ యస్ రైట్లులను మోసం చేస్తున్నాయని భట్టి విమర్శించారు.

దీనికి జిల్లా పార్టీ అధ్యక్షులు ఇంచార్జిలు భాద్యత తీసుకోని జనసమీకరణ చేయాలనీ అన్నారు . వర్కింగ్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, జిల్లాల వారీగా సమావేశాలు పెట్టి పకడ్బందీ గా జనసమీకరణ చేయాలి. నాయకులు అందరూ కలిసికట్టుగా పని చేయాలి.క్యాంపైన్ కమిటీ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పేర్కొన్నారు . ఈ సభ ద్వారా కాంగ్రెస్ సత్తా చాటి చెప్పాలని అన్నారు . వర్క్ డివిజన్ చేసి ఫలితాలు వచ్చే విదంగా పనులు చేయాలి. రాహుల్ గాంధీ గారి సభ సక్సెస్ చాలా కీలకం.. నియోజకవర్గంలో క్యాడర్ ను రాహుల్ గాంధీ సభ కు కదిలించాలి.

Leave a Reply

%d bloggers like this: