Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

25 వేల కోట్లతో ఒకేసారి 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోడీ శ్రీకారం …బీజేపీ సీనియర్ నేత డాక్టర్ పొంగులేటి హర్షం

25 వేల కోట్లతో ఒకేసారి 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోడీ శ్రీకారం …బీజేపీ సీనియర్ నేత డాక్టర్ పొంగులేటి హర్షం….
ఖమ్మం జిల్లాలో 25 కోట్లతో స్టేషన్ల అభివృద్ధి
ప్రధాని వర్చువల్ ప్రారంభ కార్యక్రమంలో ఖమ్మంలో పాల్గొన్న పొంగులేటి
స్థానిక ఎంపీ నామ, స్థానిక మంత్రి పాల్గొనకపోవడంపై ఆగ్రహం

అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 508 రైల్వే స్టేషన్ ల అభివృద్ది కి ప్రధాని మోడీ ఆదివారం వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేయడం హర్షణీయమని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నేత డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు . ఖమ్మం రైల్వే స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సుధాకర్ రెడ్డి కార్యక్రమం అనంతరం ప్రధాని మోడీ చిత్రపటా నికి పాలాభిషేకం చేశారు . ఈసందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మొదటి సారిగా దేశంలో ఇంత పెద్ద మొత్తంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఏ ప్రభుత్వం పూనుకోలేదని అన్నారు . అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు . అభివృధి కార్యక్రమాల్లో బి ఆర్ ఎస్ రాజకీయా లు చేయడం దురదృష్టకరం మన్నారు . ఖమ్మం ఎంపీ నామా, మంత్రి అజయ్ ఇంత మంచి కార్యక్రమానికి హజరుకాక పోవడం వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు …

దేశంలోని 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పథకం, దేశవ్యాప్తంగా 25000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపు జరిగిందని అన్నారు . ఇందులో 21 ఎబిబిఎస్ రైల్వే స్టేషన్లు ఉన్నాయన్నారు . తెలంగాణ లో , 25.4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు . ఖమ్మం రైల్వే స్టేషన్ కార్యక్రమంలో, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య, స్వాతంత్య్ర సమరయోధులు వీరయ్య బీజేపీ నాయకులు సుధాకర్ రెడ్డి , గల్లా సత్యనారాయణతో ఉప్పల శారద, వాసుదేవ్ రావు, నంబూరి రామలింగేశ్వరరావు, తదితరులు పాల్గొని ప్రధానమంత్రి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వీక్షించారు .

Related posts

జైల్లో నిందితుడిని పెట్టుకుని దేశమంతా గాలించిన పోలీసులు!

Drukpadam

ఇండిగో విమానంలో పనిచేయని ఏసీ.. 90 నిమిషాల పాటు నరకం

Ram Narayana

మిలిటెంట్ల విడుదల కోసం ఆర్మీని చుట్టుముట్టిన మణిపూర్ మహిళలు!

Drukpadam

Leave a Comment