Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ తో కేసీఆర్ పొత్తు… మా హైకమాండ్ ఒప్పుకోలేదు: కోమటిరెడ్డి…

  • కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన కోమటిరెడ్డి
  • ఇక్కడ ఏం సాధించారని దేశం గురించి మాట్లాడుతున్నారని ప్రశ్న
  • కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శ

దేశం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణను ఏం అభివృద్ధి చేశాడని దేశం గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు గురించి కేసీఆర్ అడిగారని… అయినప్పటికీ తమ అధిష్ఠానం ఒప్పుకోలేదని తెలిపారు. కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని కోమటిరెడ్డి ఆరోపించారు. తన మీదున్న కక్షతోనే నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదని అన్నారు. ధరణి వెబ్ సైట్ తో రైతులందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారని… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎత్తేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్యు చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. 70 శాతం గ్రామాల్లో ఇంకా వడ్లు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు సాధారణ విషయమేనని అన్నారు.

Related posts

డీకే శివకుమార్ తో వైఎస్ షర్మిల భేటీ

Drukpadam

జైలు నుంచి విడుదలైన బండి సంజయ్.. సీపీ రంగనాథ్ పై ఆగ్రహం!

Drukpadam

నెల్లూరు జిల్లా అతలాకుతలం.. డ్యామ్ లన్నీ ఫుల్.. ఉద్ధృతంగా చెరువులు, వాగులు

Drukpadam

Leave a Comment