Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎపీలో 10వ తరగతి పేపర్ లీక్ కు సంబంధించి 12 మంది అరెస్ట్!

12 arrested in 10th class exam paper leakage

నంద్యాల జిల్లాలో 10వ తరగతి పేపర్ లీక్ కు సంబంధించి 12 మంది అరెస్ట్!

  • అంకిరెడ్డిపల్లిలో నిన్న తెలుగు పేపర్ లీక్
  • పేపర్ లీకేజ్ సూత్రధారి రాజేశ్
  • 9 మంది తెలుగు టీచర్ల అరెస్ట్

ఏపీలోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి హైస్కూల్ లో నిన్న పదో తరగతి క్వశ్చన్ పేపర్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లీకేజి సూత్రధారి రాజేశ్ తో పాటు మరో 11 మంది టీచర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, పరీక్షల డ్యూటీకి హాజరై మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన ప్రధాన వ్యక్తి రాజేశ్ అని చెప్పారు. పేపర్ లీక్ అయినట్టు సమాచారం అందిన వెంటనే డీఈవో, పోలీసు అధికారులు విచారణ చేపట్టారని తెలిపారు.

పరీక్ష ప్రారంభమైన వెంటనే తన మొబైల్ తో పరీక్షపత్రాన్ని ఫొటోలు తీశాడని… బయట వేచి ఉన్న 9 మంది తెలుగు టీచర్లకు పోస్ట్ చేశాడని జిల్లా కలెక్టర్ చెప్పారు. అరెస్టయిన వారిలో టీచర్లు నాగరాజు, నీలకంఠేశ్వరరెడ్డి, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు, దస్తగిరి, వనజాక్షి, లక్ష్మి, దుర్గ, పోతునూరు, ఆర్యభట్ట, రంగనాయకులు ఉన్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, డిపార్టుమెంట్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్ కు చెందిన నలుగురిని సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. మరోవైపు అరెస్ట్ చేసిన వారిని ఈ ఉదయం కోర్టులో హాజరు పరిచారు.

Related posts

ఎవరితోనూ పొత్తులు ఉండవు… వైఎస్సార్ పేరు చాలు: షర్మిల

Drukpadam

భారత దగ్గుమందుపై ఆఫ్రికా ఆరోపణలు మనకు సిగ్గుచేటు: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి!

Drukpadam

యూపీలో కరోనా మాత పేరిట ఆలయం…..

Drukpadam

Leave a Comment