లేడీ కానిస్టేబుల్ పై దాడి కేసులో జిగ్నేష్ మేవానీకి బెయిల్!

లేడీ కానిస్టేబుల్ పై దాడి కేసులో జిగ్నేష్ మేవానీకి బెయిల్!

  • ఇటీవల మోదీపై వ్యాఖ్యల కేసులో మేవానీకి బెయిల్
  • వెంటనే మరో కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు
  • విధుల్లో ఉన్న ఉద్యోగినిపై దాడి చేశాడని ఆరోపణలు

గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి మరో కేసులోనూ బెయిల్ లభించింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ అసోం కోక్రాఝార్ పోలీసులు జిగ్నేష్ మేవానీని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోక్రాఝార్ కోర్టు మేవానీకి బెయిల్ ఇచ్చింది.

అయితే ఆయనను పోలీసులు ఓ మహిళా కానిస్టేబుల్ పై దాడి చేశాడన్న ఆరోపణలతో మరో కేసులో అరెస్ట్ చేశారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగినిపై దాడి చేశాడని అభియోగాలు మోపారు. ఇప్పుడు ఈ కేసులో జిగ్నేష్ మేవానీ బెయిల్ పొందారు.

Leave a Reply

%d bloggers like this: