Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేటీఆర్ మాటల దుమారం …. ఏపీ మంత్రుల కౌంటర్ ….

కేటీఆర్ మాటల  దుమారం …. ఏపీ మంత్రుల కౌంటర్ ….
హైద‌రాబాద్‌లో క‌రెంట్ లేక జ‌న‌రేట‌ర్‌పై ఉండాల్సి వ‌చ్చింది: బొత్స
కేటీఆర్‌కు ఎవ‌రో స్నేహితుడు చెప్పాడేమో.. నేను నిన్న‌టిదాకా హైద‌రాబాద్‌లోనే ఉన్నా
కేటీఆర్ మాట‌ల‌ను నేను ఆక్షేపిస్తున్నాను
మీ ద‌గ్గ‌ర జ‌రిగిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోవ‌చ్చు
కానీ ప‌క్క రాష్ట్రాల‌ను విమ‌ర్శించ‌వ‌ద్దు
కేటీఆర్ త‌న వ్యాఖ్య‌ల‌ను వెనక్కు తీసుకోవాలన్న బొత్స‌

కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి స్పంద‌న‌

కేటీఆర్ టైమ్, డేట్ చెబితే ఏపీ అంతా తిప్పి చూపిస్తా… సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం రోజా ఆఫర్

ఉమ్మ‌డి రాష్ట్రంలోనే హైద‌రాబాద్ అభివృద్ధి… కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై స‌జ్జ‌ల స్పంద‌న‌

 

ఏపీలో మౌలిక వ‌స‌తులు లేవంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీకి చెందిన నేత‌లు వ‌రుస‌గా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్పందించారు. ఏపీ గురించి కేటీఆర్ ప్ర‌త్య‌క్షంగా ఏమీ చూడ‌కుండానే ఆయ‌న స్నేహితుడు చెప్పిన మాట‌లు నిజ‌మ‌ని న‌మ్మి ఆయ‌న వ్యాఖ్య‌లు చేశార‌న్న బొత్స‌… తెలంగాణ‌లో ప‌రిస్థితుల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసినా తాను ఎవ‌రికి చెప్పుకోవడం లేదు క‌దా అంటూ స్పందించారు. త‌మ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకోవ‌చ్చు గానీ పొరుగు రాష్ట్రాల‌ను విమ‌ర్శించ‌రాదంటూ బొత్స అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈ సంద‌ర్భంగా బొత్స మాట్లాడుతూ “ఏపీ గురించి కేటీఆర్‌కు ఎవ‌రో స్నేహితుడు ఫోన్ చేశాడేమో. నేను నిన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌లోనే ఉన్నా. క‌రెంట్ లేక జ‌న‌రేట‌ర్ మీద ఉండాల్సి వ‌చ్చింది. ఇది నేనెవ‌రితోనూ చెప్ప‌లేదు క‌దా. కేటీఆర్ మాట‌ల‌ను నేను ఆక్షేపిస్తున్నాను. బాధ్య‌త క‌లిగిన స్థాయిలో ఉండి అలా మాట్లాడ‌కూడ‌దు. మీ ద‌గ్గ‌ర జ‌రిగిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోవ‌చ్చు. కానీ ప‌క్క రాష్ట్రాల‌ను విమ‌ర్శించ‌వ‌ద్దు. కేటీఆర్ త‌న వ్యాఖ్య‌ల‌ను వెనక్కు తీసుకోవాలి” అని బొత్స వ్యాఖ్యానించారు.

కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి స్పంద‌న‌

ఏపీలో మౌలిక వ‌స‌తులు ఆధ్వాన్నంగా ఉన్నాయంటూ తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ ఇంధ‌న శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా స్పందించారు.

ఈ సంద‌ర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ “తెలంగాణలో సింగ‌రేణి బొగ్గు గ‌నులు ఉన్నాయి. అందుకే తెలంగాణ‌లో క‌రెంట్ కోత‌లు లేవు. ఏపీలో కూడా విద్యుత్ కోత‌లు లేవు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే కేటీఆర్ వ్యాఖ్య‌లు. బొగ్గును ఎక్కువ‌ ధ‌ర‌కు కొన‌డానికైనా సిద్ధం. పంచాయ‌తీరాజ్‌లోనే 10 వేల కిలోమీట‌ర్ల‌కు పైగా రోడ్లు నిర్మించాం. తెలంగాణ‌లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు రానున్నాయి. ఎవ‌రో ఒక‌ర్ని కించ‌ప‌రిస్తే ఓట్లు ప‌డ‌తాయ‌ని విమ‌ర్శించారు” అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

కేటీఆర్ టైమ్, డేట్ చెబితే ఏపీ అంతా తిప్పి చూపిస్తా… సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం రోజా ఆఫర్

ఏపీలో రోడ్లు, ఇతర మౌలిక వసతుల పరిస్థితి దారుణంగా ఉందంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దీనిపై ఏపీ ప‌ర్యాట‌కం, సాంస్కృతిక‌, యువ‌జ‌న శాఖ మంత్రి రోజా స్పందించారు. కేటీఆర్ ఏపీకి వచ్చి చూసి వ్యాఖ్యానించి ఉంటే బాగుండేదని హితవు పలికారు. ఈ సాయంత్రం రోజా హైదరాబాదులో ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు.

ఏపీ పరిస్థితుల గురించి ఎవరో చెప్పారని కేటీఆర్ అంటున్నారని, ఆ చెప్పిందెవరో గానీ కేటీఆర్ ను తప్పుదోవ పట్టించారని వెల్లడించారు. “కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నేను వాట్సాప్ లో చూశాను. ఒక యంగ్ డైనమిక్ లీడర్ గా, స్ఫూర్తిదాయకమైన నేతగా కేటీఆర్ ను అందరం గుర్తిస్తాం. అటువంటి కేటీఆర్ మా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతారని నేను అనుకోను. ఆయన వ్యాఖ్యలను గమనిస్తే ఎక్కడా ఏపీ అనే పదం వాడలేదు. పొరుగు రాష్ట్రాలు అనే మాట వాడారు. ఒకవేళ ఏపీ గురించి అనుంటే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నా.

టూరిజం మినిస్టర్ గా నేను కేటీఆర్ ను ఏపీకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఇతర రాష్ట్రాలు కూడా స్ఫూర్తిగా తీసుకునే సీఎం జగన్ పాలనలో ఏపీ ఎలా ఉందో చూడండి. సీఎం జగన్ అమలు చేస్తున్న అనేక విప్లవాత్మకమైన మార్పులను నేను కేటీఆర్ కు దగ్గరుండి చూపిస్తాను.

కేటీఆర్… ఏపీ పరిస్థితులను చెప్పారని భావిస్తున్న ఆయన ఫ్రెండును కూడా తీసుకువస్తే ఏపీలో నాడు-నేడు కింద పాఠశాలలు, ఆసుపత్రులు ఎలా పునరుద్ధరించామో చూపిస్తాను. అంతర్గత రహదారులు, కేంద్రంతో కలిసి నిర్మిస్తున్న జాతీయ రహదారులను కూడా చూపిస్తాను. అవినీతికి తావు లేకుండా, పొరుగు రాష్ట్రం తమిళనాడును కూడా ఆకర్షిస్తున్న ఏపీ వాలంటీర్ వ్యవస్థను కూడా కేటీఆర్ కు చూపిస్తాను. సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందిస్తున్న తీరును చూపిస్తాను.

ఇవన్నీ చూపిస్తే తెలంగాణలోనూ ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టాలని కేటీఆర్ తప్పక అనుకుంటారు. ఆ ఫ్రెండ్ చెప్పింది తప్పు అని కూడా కేటీఆర్ తెలుసుకుంటారని భావిస్తున్నా. మరి కేటీఆర్ ఏపీకి ఎప్పుడు వస్తారో డేట్, టైమ్ చెబితే వెయిట్ చేస్తాను. ఆయనకు స్వాగతం పలికి, టూరిజం మినిస్టర్ హోదాలో రాష్ట్రమంతా తిప్పి చూపిస్తాను. కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా జగన్ సాగిస్తున్న పాలనను చూపిస్తాను” అని రోజా స్పష్టం చేశారు.

ఇవాళ దేశంలో తెలంగాణతో సహా 16 రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నాయని, అది అందరికీ తెలిసిన విషయమేనని రోజా అన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పనులు కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి కేటీఆర్ వచ్చి చూస్తే అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు. పక్కనున్న వాళ్ల మాటలు నమ్మి టీవీ చానళ్ల ముందు చెబితే ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని కేటీఆర్ గుర్తించాలన్నారు. అందుకే కేటీఆర్ స్వయంగా వచ్చి ఏపీలో పరిస్థితులు చూసి అప్పుడు మాట్లాడాలని రోజా హితవు పలికారు.

ఉమ్మ‌డి రాష్ట్రంలోనే హైద‌రాబాద్ అభివృద్ధి… కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై స‌జ్జ‌ల స్పంద‌న‌

ఏపీలో మౌలిక వ‌స‌తులు అధ్వానంగా ఉన్నాయ‌న్న తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్య‌ల‌ను రాజ‌కీయం చేయ‌ద‌ల‌చుకోలేద‌న్న స‌జ్జ‌ల‌.. ఎవ‌రైనా ముందుగా త‌మ రాష్ట్రం గురించి చెప్పుకోవాల‌ని, ఆ త‌ర్వాత ఇత‌ర రాష్ట్రాల గురించి మాట్లాడాల‌ని హితవు పలికారు.

“మొన్న‌టివ‌ర‌కు తెలంగాణ‌లోనూ విద్యుత్ కోత‌లున్నాయి. రోడ్లు కూడా బాగా లేవు. విభ‌జ‌న త‌ర్వాత ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తి కాలేదు. సుమారు 50 నుంచి 60 వేల కోట్ల ఆస్తుల విభ‌జ‌న జ‌ర‌గాల్సి ఉంది. ఏపీకి రాజ‌ధాని లేకుండా విభ‌జించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలోనే హైద‌రాబాద్ అభివృద్ధి చెందింది. పీవీ హైవే కూడా వైఎస్ హ‌యాంలో నిర్మించిందే” అని స‌జ్జ‌ల వ్యాఖ్యానించారు.

Related posts

సిమెంట్ రేటు తగ్గించరు కానీ, సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తారట!: చంద్రబాబు వ్యంగ్యం!

Drukpadam

రాష్ట్రపతి రేసులో ఆరడజన్ పైగా పేర్లు …తమిళశై సౌందరరాజన్ పేరుకూడా…

Drukpadam

తెలంగాణలో గెలుపు కోసం కాంగ్రెస్ వ్యూహం, విలేజ్ కమిటీల ఏర్పాటు!

Drukpadam

Leave a Comment