Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ లో జిల్లాల అధ్యక్షులని నియమించారు …కానీ కమిటీలను మరిచారు…

టీఆర్ యస్ లో జిల్లాల అధ్యక్షులని నియమించారుకానీ కమిటీలను మరిచారు
నెల 28 హాట్టహాసంగా జరిగిన టీఆర్ యస్ ప్లినరీ
కమిటీలు లేకుండా కేవలం అధ్యక్షులు ఏమిచేస్తారనే సందేహాలు
పూర్తీ స్థాయి కమిటీల కోసం ఎదురు చూస్తున్న టీఆర్ యస్ జిల్లా నేతలు
ఎమ్మెల్యేతోనే అన్ని నడిపిస్తున్న కేసీఆర్
పార్టీ నిర్మాణానికి జిల్లా అధ్యక్షుడితోపాటు కమిటీలు ఏర్పాటు పై కార్యకర్తల ఎదురు చూపులు

రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ యస్ పార్టీ ఇటీవలనే 20 సంవత్సరాల పండగ జరుపుకుంది.ప్లినరీకి ముందే జిల్లా అధ్యక్షులను నియమించిన టీఆర్ యస్ జిల్లా కమిటీలను నియమించకపోవడంపై క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి ఉంది. జిల్లా అధ్యక్షుల ఎంపికలోనూ కొత్తవారికి ఏపదవులు లేకుండా ఉన్నవారికి, కాకుండా ఎమ్మెల్యేలకు , ఎంపీలకు , ఎమ్మెల్సీలకు డీసీసీబీ చైర్మన్లకు కట్టబెట్టటంపై ఆశావహులు అసహనంతో ఉన్నారు . అధ్యక్షుల ఎంపికలో జిల్లా మంత్రుల అభిప్రాయాలు సైతం పక్కన పెట్టిన కేసీఆర్ తనమార్క్ చూపించారు. దీంతో మంత్రులు సైతం అయోమయంలో పడ్డారు . కేసీఆర్ దగ్గర తమపప్పులు ఉడకవని మరోసారి తెలుసు కున్నారు . ఇప్పడు కమిటీలలోనైనా తమ వారికీ పదవులు ఇప్పించు కుందామంటే అధ్యక్షులను నియమించి నెలలు కావస్తున్నా కమిటీల నియామకంపై కేసీఆర్ ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం పై పార్టీలో చర్చ నడుస్తుంది. జిల్లాల్లో పార్టీ కమిటీలు నియమించి పార్టీ పథకాలు , ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో విస్త్రత ప్రచారం చేయాల్సి ఉండగా అది లేకపోవడం, కార్యకర్తలకు పని కల్పించకపోవడం పై పార్టీలో అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి. వచ్చే సంవత్సరం లో శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటినుంచే క్యాడర్ ను సిద్ధం చేయాల్సి ఉండగా జిల్లా కమిటీల ఊసే లేకపోవడం అధ్యక్షులతో కలం వెళ్లబుచ్చడం కార్యకర్తలను నిరాశకు గురిచేస్తుంది.

20 సంవత్సరాల పండగ చేసుకున్న టీఆర్ యస్ మంచి యుక్తవయస్సు ఉన్న పార్టీగా ఉరకలు పెడుతుంది. అనేకమంది యువకులు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ , ఉపాధి అవకాశాల కోసం గత 8 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు . ఇటీవలే ఉద్యోగ నోటిఫికేషన్ లమీద కదలిక వచ్చిన ఎందుకు ప్రభుత్వం నియామకాలు సక్రమంగా చేస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. టీఆర్ యస్ అధినేత కేసీఆర్ ను దేవుడిగా రాష్ట్ర సాధకుడిగా కొలిచిన యువకులే నేడు కేసీఆర్ పాలపై ముఖం తిప్పుతున్నారు. పార్టీలోనూ అసమ్మతి గూడు కట్టుకొని ఉంది. ప్రతిజిల్లాలో నాయకుల మధ్య పొసగని వ్యవహారాలను చక్కదిద్దటంలో పార్టీ వైఫల్యాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి .

ఈ నెల 28 న టీఆర్ యస్ ప్లినరీ హాట్టహాసంగా జరిగింది. అందులో కేసీఆర్ రాష్ట్ర దేశం ,కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అనర్గళంగా ఉపన్యాసం చేశారు . టీఆర్ యస్ మాదిరిగానే దేశం లో బీ ఆర్ యస్( భారతీయ రాష్ట్ర సమితి ) పెట్టె యోచనలో ఉన్నట్లు కేసీఆర్ ప్రతినిధుల హర్షద్వానాల మధ్య వెల్లడించారు. దేశంలో బీజేపీ కి ప్రత్యాన్మాయ వేదిక అవసరం ఉందని తాను దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులతో , రాజకీయ పార్టీల నాయకులతో , వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సంప్రదింపులు జరిపానని అందరి అభిప్రాయాల మేరకు ఈ విషయాలు చెబుతున్నానని కూడా పేర్కొన్నారు.

కేసీఆర్ ఆలోచనకు చాలామంది సుముఖంగా లేరని కాంగ్రెస్ లేని బీజేపీ ప్రత్యాన్మాయం సాధ్యం కాదనికూడా కేసీఆర్ తో కుండబద్దలు కొట్టారని వార్తలు వచ్చాయి. దానిపై కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదు . కేసీఆర్ ప్రత్యాన్మాయ ప్రయత్నాల సందర్భంలోనే కాంగ్రెస్ బీజేపీ వైఖరిపై 13 పార్టీలతో కలిసి ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఎన్సీపీ , టీఎంసీ , ఆర్జేడీ , డీఎంకే సిపిఎం సిపిఐ పార్టీలు ఉండటం విశేషం . బీజేపీ తో జరిపే పోరాటంలో చీలిపోతే బీజేపీ కె లాభం అని కేసీఆర్ లాంటి రాజకీయ చాణిక్యుడికి తెలియని విషయం కాదు . బీజేపీ తో అనేక ముఖ్యమైన విషయాలతో కలిసి పనిచేసిన కేసీఆర్ వడ్ల విషయంలో యుద్ధం చేయడం ఏమిటి అనే సందేహాలు కూడా ఉన్నాయి. డిమోనటైజేషన్.జీఎస్టీ ,రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కి మద్దతు ఇచ్చిన టీఆర్ యస్ ఒక చిన్న సమస్యపై పెద్ద యుద్ధం చేయడంలో ఆంతర్యం ఏమిటో కేసీఆర్ చెప్పాలి … రాష్ట్రంలో పార్టీ నిర్మాణం లేకుండా కమిటీలను పూర్తీ చేయకుండా దేశంలో పార్టీ పెడతానంటే ఎంతవరకు సాధ్యమో ఆలోచించాల్సిందే అనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. చూద్దాం ఏమిజరుగుతుందో ….?

Related posts

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్!

Drukpadam

బొత్స ఛాంబ‌ర్‌లో న‌లుగురు మంత్రులు.. ఏం చ‌ర్చించారంటే..!

Drukpadam

ఢీ అంటే ఢీ …పొంగులేటి వర్సెస్ బీఆర్ యస్…

Drukpadam

Leave a Comment