ఆవుల అక్రమరవాణా :సిలిండర్ పేలి 13 ఆవుల సజీవ దహనం!

ఆవుల అక్రమరవాణా :సిలిండర్ పేలి 13 ఆవుల సజీవ దహనం!
-నిర్మల్ నుంచి హైద్రాబాద్ కు గుట్టుచప్పుడు కాకుండా రవాణా
-అంబులెన్స్ ద్వారా తరలిస్తున్న వైనం
-ఇందల్వాయి వద్ద సిలిండర్ పేలడంతో దగ్దమైన వాహనం
-అందులో సజీవ దహనమైన 13 ఆవులు
-అవాక్కయిన పోలీసులు

రాష్ట్రంలో ఆవుల అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా చోటు చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఓ అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న ఆవులు సజీవదహనమయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, అధికారులకు చిక్కకుండా ఉండేందుకే దుండగులు ఆవులను.. మనుషులను తరలించే అంబులెన్స్ లో అక్రమంగా తరలించినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదవశాత్తు అంబులెన్స్‌కు మంటలు అంటుకోవడంతో.. ఆవులన్నీ సజీవదహనమయ్యాయి. ఈ ఘటన జిల్లాలో కలకలంగా మారింది. శనివారం రాత్రి అంబులెన్స్ స్టిక్కర్ ఉన్న వాహనంలో ఆవులను అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు కొందరు దుండగులు.

గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న ఆవుల తరలింపు వ్యాపారం ఎప్పటినుంచి జరుగుతుందో తెలియదు . మనుషులను తరలించే అంబులెన్స్ వాహనంలో ఆవులను వెక్కించి ఎవరికీ అనుమానం రాకుండా ఆవులను హైద్రాబాద్ కు తరలించడం జరుగుతుందని ఈ సంఘటన ద్వారా మాత్రమే వెల్లడైంది. నిర్మల్ నుంచి హైద్రాబాద్ కు వెళుతున్న ఈ వాహనానికి ఇందల్వాయి వద్ద ఒక్కసారిగా వాహనంలోని సిలిండర్ పేలడంతో డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారు అయ్యాడు . అక్కడు చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పీ డోర్లు తెరిచి చూసి ఒక్కసారిగా అవాక్కు అయ్యారు. చిన్న అంబులెన్స్ లో ఒకటికాదు రెండు కాదు ఏకంగా 13 ఆవులు తగలబడి ఉండటం చూసి షాక్ తిన్నారు . పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు . అంబులెన్స్ మీద ఉన్న నెంబర్ ఆధారంగా వెహికల్ ఓనర్ కోసం వెతుకుతున్నారు. .

 

Leave a Reply

%d bloggers like this: