భానుడి భగభగలు …నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

భానుడి భగభగలు …నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!
నిజామాబాద్‌ జిల్లాలోని రెంజల్‌లో నిన్న 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
బయటకు వచ్చేందుకు భయపడుతున్న ప్రజలు
అత్యాసరమైతే తప్ప బయట తిరగొద్దని ప్రభుత్వం హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాల్లో వడగాలుల‌ ప్రభావంతో అల్లాడిపోతోన్న ప్ర‌జ‌లు
ఏపీలో నేడు 44 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం
తెలంగాణ‌లో నిన్న‌ వడగాలుల వ‌ల్ల‌ ఆరుగురి మృతి

తెలుగు రాష్ట్రాల్లో ఎండ‌లు మండిపోతున్నాయి. భానుడి భగభగలు దాటికి ప్రజలు అల్లాడి పోతున్నారు . బయటకు వచ్చేందికి భయపడి పోతున్నారు. అత్యాసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నాయి. పల్లెలనుంచి పట్టణాలకు వచ్చే వారు నిద్రకోసం తహతహలాడుతున్నారు . మజ్జిగ , మంచినీళ్లు , చెరుకురసం,కొబ్బరి నీళ్లు , ఇతర సీట్ల పానీయాలకోసం ప్రజలు ఎగబడుతున్నారు . తలపై ఏడూ ఒక గుడ్డ , టవల్ , టోపీ లేకుండా బయటకు వెళ్లడం అంటే నిప్పుల కొలిమిలోకి వెళ్లుతున్నట్లే . ..టీలంగాణలోని వారం 10 రోజుల నుంచి ఉష్టోగ్రతలు పెరిగాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్‌లో నిన్న‌ రికార్డు స్థాయిలో 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు .

ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతుండ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. వ‌డ‌గాలుల ప్ర‌భావ‌మూ అధికంగా ఉండ‌డంతో తీవ్రంగా అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నేడు 44 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెప్పారు.

మ‌రోవైపు, తెలంగాణ‌లో నిన్న‌ వ‌డ‌గాలులు, వ‌డ‌దెబ్బ‌ వ‌ల్ల‌ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్‌ జిల్లాలోని రెంజల్‌లో నిన్న‌ రికార్డు స్థాయిలో 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

కోల్ బెల్ట్ ఏరియాలో ఎండలు దంచి కొడుతున్నాయి.తెలంగాణాలో వడదెబ్బకు ఇప్పటికే 6 గురు చనిపోయారు . మే మొత్తం ఎండలు ఇదే విధంగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పింది. అందువల్ల అనేక పట్టణాలు ,నగరాల్లో మిట్ట మధ్యాహ్నం కర్ఫ్యూ వాతావరణం కనపడుతుంది. ఎవరికీ వారు జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బవల్ల ఇబ్బందులు తప్పవని ప్రభుత్వాలు అంటున్నాయి….

Leave a Reply

%d bloggers like this: