Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

“కాంగ్రెస్’ను ట్విట్టర్ బయో నుంచి తీసేసిన హార్దిక్ పటేల్

‘కాంగ్రెస్’ను ట్విట్టర్ బయో నుంచి తీసేసిన హార్దిక్ పటేల్
ప్రౌడ్ ఇండియన్ ప్యాట్రాయిట్. సోషల్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్’అని బయోగ మార్చారు
హార్దిక్ పటేల్ బీజేపీ లో చేరబోతున్నారంటూ ప్రచారం
కొంతమంది తనను కాంగ్రెస్ నుంచి పంపి వేయాలని చుస్తున్నారంటున్న హార్దిక్ పటేల్
ఇటీవల బీజేపీ ని పొగుడుతూ కామెంట్లు
ఢిల్లీలో కొంతమంది బీజేపీ నాయకులను కలిసినట్లు ప్రచారం
గుజరాత్ ఎన్నికల ముందు ఆసక్తికరం

గుజరాత్ లో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన పటిదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ రాజకీయ అడుగులపై ఆశక్తినెలకొన్నది. దేశం దృష్టిని ఆకర్శించిన పటిదార్ ఉద్యమానికి హార్దిక్ పటేల్ నాయకత్వం వహించడమే కాకుండా అనేక నిర్బంధాలు , అరెస్ట్ లు ,జైలు జీవితాలను అనుభవించిన హార్దిక్ పటేల్ చివరకు బీజేపీ ని గుజరాత్ లో గద్దె దించాలని కాంగ్రెస్ పార్టీలో చేరడం అప్పట్లో సంచలనంగా మారింది. అదే హార్దిక్ పటేల్ ఇప్పడు బీజేపీ వైపు చూస్తున్నారని వస్తున్నా వార్తలు సంచలనంగా మారాయి.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీని వీడతారంటూ జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా కీలక నేత హార్దిక్ పటేల్ తాజా వ్యవహారం ఉంది. ఇప్పటి వరకు ట్విట్టర్ బయోగా ఉన్న ‘వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ గుజరాత్ కాంగ్రెస్’ను హార్ధిక్ పటేల్ సూచించారు.

‘ప్రౌడ్ ఇండియన్ ప్యాట్రాయిట్. సోషల్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్’ అని తన బయోగా మార్చేశారు హార్దిక్ పటేల్. భారతీయ జనతా పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందు గుజరాత్ రాజకీయాల్లో ఇది కీలకంగా మారననున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఇటీవల అధిష్టానంపైనా హార్దిక్ పటేల్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు. దీంతో గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ తమతో చర్చకు రావాలని హార్దిక్ పటేల్ ను ఆహ్వానించారు. ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతుందని హార్దిక్ పటేల్ తనతో చెప్పారని ఆయన అన్నారు. చర్చించి సమస్యలను పరిష్కరించుకుందామని హార్దిక్‌కు చెప్పినట్లు ఠాకూర్ వెల్లడించారు. చర్చలతోనే సమస్యలు, భేదాభిప్రాయాలు తొలగిపోతాయని పార్టీ హైకమాండ్ కూడా భావిస్తోందని జగదీష్ ఠాకూర్ తెలిపారు. కాగా, తనను కాంగ్రెస్ పార్టీ నుంచి పంపించాలని కొందరు భావిస్తున్నారని హార్దిక్ పటేల్ ఇటీవల ట్వీట్ చేశారు. తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, అయితే, రాష్ట్ర పార్టీలో సమస్యలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిష్కరిస్తుందని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని కోరుకుంటున్నప్పటికీ.. కొందరు మాత్రం తనను పార్టీ నుంచి పంపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

కాగా, 2015లో పటీదార్ ఆందోళనతో హార్దిక్ పటేల్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, ఇటీవల బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం, ఢిల్లీలో కొందరు నేతలను కలవడంతో హార్దిక్ పటేల్ బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే, తాను బీజేపీలో చేరాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బయోను ట్విట్టర్ నుంచి తీసేయడం చర్చనీయాంశంగా మారింది.

 

Related posts

ఖమ్మం కాంగ్రెస్ లో రేవంత్ నిరుద్యోగ నిరసన ర్యాలీ జోష్…

Drukpadam

మేం నమ్మిన వాళ్లే అవసరానికి మమ్మల్ని ఆదుకోలేదు: ప్రధాని నరేంద్ర మోదీ..!

Drukpadam

గోవాలో ‘కుల’ ఆయుధాన్ని ఎక్కుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ.. సీఎం అభ్యర్థిగా పాలేకర్!

Drukpadam

Leave a Comment