ఈ నెల 7న మంత్రి కెటిఆర్ వ‌రంగ‌ల్‌ ప‌ర్య‌ట‌న‌…

ఈ నెల 7న మంత్రి కెటిఆర్ వ‌రంగ‌ల్‌ ప‌ర్య‌ట‌న‌…

-చింతలపల్లి లో కైటెక్స్ మెగా టెక్స్టైల్ పార్క్ కు శంకుస్థాపన, భూమి పూజ

-ఐటీ ప్రొఫెషనల్స్ తో ఇంటరాక్షన్

-ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశం

-సాప్ట్ పాత్ ఐటీ ఆఫీస్ సందర్శించే అవకాశం

ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్‌, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో కేటీఆర్ పర్యటన ఖరారు, ఏర్పాట్ల పై సమీక్షించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు

ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ఐటి, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖల మంత్రి కేటీ రామారావు వరంగల్ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. కేటీఆర్ పర్యటన ఖరారు, ఏర్పాట్లపై హన్మకొండలోని తన క్యాంప్ కార్యాలయం అర్ అండ్ బి అతిథి గృహంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యలు చల్లా ధర్మా రెడ్డి, అరూరి రమేశ్, కుడా చైర్మన్ సుందర్ రాజు, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, వరంగల్ మహానగర కమిషనర్, సీపీ, ఇతర అధికారులతో సమావేశ మై కేటీఆర్ పర్యటన, ఏర్పాట్ల పై చర్చించారు.

వరంగల్ వరంగల్ పర్యటన సందర్భంగా కేటీఆర్, ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కైటెక్స్ మెగా టెక్స్టైల్ పార్క్ కు శంకుస్థాపన, భూమి పూజ చేయనున్నారు. అలాగే, గణేష్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ ను ప్రారంభిస్తారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్ హనుమకొండలోని పీజేఆర్ గార్డెన్స్ లో ఐటీ ప్రొఫెషనల్స్ తో ఇంటరాక్షన్ అవుతారు. ఈ సందర్భంగా ఐటీ రంగం, ఐటీ కంపెనీల విస్తరణ, అవకాశాలు, ఉపాధి వంటి పలు అంశాల పై కేటీఆర్ వారితో చర్చిస్తారు. అలాగే నయీం నగర్ లో గల సాప్ట్ పాత్ ఐటీ ఆఫీస్ సందర్శించే అవకాశం ఉంది.

అనంతరం కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి పై వారితో చర్చిస్తారు. అలాగే ప్రజా ప్రతినిధులతో కలిసి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది.

కాగా ఆరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హనుమకొండకు చేరుకుని, కార్యక్రమాలను ముగించుకొని తిరిగి హెలికాప్టర్ ద్వారానే హైదరాబాద్ చేరుకుంటారు.

కేటీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు తగు ఏర్పాట్లను చేసి సంసిద్ధంగా ఉండాల్సింది గా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు.

Leave a Reply

%d bloggers like this: