ప్రయాణికులతో అమర్యాదగా ప్రవర్తించిన పెట్రోలింగ్ పోలీసులు …విచారణకు ఆదేశించిన సీపీ!

ప్రయాణికులతో అమర్యాదగా ప్రవర్తించిన పెట్రోలింగ్ పోలీసులు …విచారణకు ఆదేశించిన సీపీ!
-పోలీస్ కమిషనర్ ఆదేశాలతో విచారణ చేపట్టనున్న అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ గౌష్ అలమ్…..
-విచారణ ఆనంతరం వాస్తవాలు పరిశీలించి పెట్రోలింగ్ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు…
-బాధితుల లిఖిత పూర్వక ఫిర్యాదుతో విచారణకు ఆదేశించిన పోలీస్ కమిషనర్.

గత రాత్రి ముదిగొండ మండలం కమలాపురం గ్రామానికి చెందిన బొమ్మగాని దుర్గారావు అతని భార్య భవానీ మరియు అమె
సోదరుడు వెంకటేష్ తో కలిసి హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామం కమలాపురం వస్తున్న క్రమంలో నేలకొండపల్లి వద్ద రాత్రి పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ప్రయాణీకులను అపి సంబంధం లేని ప్రశ్నలతో
ఇబ్బందులకు గురిచేశారని, ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా అమర్యాదగా ప్రవర్తించారని బాధితులు ఈరోజు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ని కలసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ విచారణ చేపట్టి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు.

పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టనున్న అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ గౌష్ అలమ్… సంఘటనకు సంబంధించిన వివరాలు బాధితుల నుండి తీసుకొన్నారు. ఆనంతరం విచారణ చేపట్టి పెట్రోలింగ్ పోలీసు సిబ్బంది నుండి వివరణ తీసుకొనున్నారు. వాస్తవాలు పరిశీలించి శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: