కేసీఆర్ కు 28 స్థానాలకంటే ఎక్కువ సీట్లు రావని పీకే చెప్పారు …కె ఏ పాల్!

ప్రశాంత్ కిశోర్ తో మాట్లాడాను: కేఏ పాల్!

తనపై దాడి చేసిన వ్యక్తి కేటీఆర్ మనిషేనన్న పాల్ 

టీఆర్ఎస్ కు 28 స్థానాల కంటే ఎక్కువ రావని పీకే చెప్పారని వ్యాఖ్య 

పీకేని పార్టీ పెట్టమని చెప్పింది కేసీఆరే అన్న పాల్ 

క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై నిన్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ నేతలపై కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. సిరిసిల్ల ఎస్పీతో నిన్న కేటీఆర్ మాట్లాడిన తర్వాతే తనపై దాడి జరిగిందని అన్నారు. తొలుత 15 నుంచి 20 మంది పోలీసులు వచ్చారని, ఆ తర్వాత డీఎస్పీ, సీఐ వచ్చారని… అనంతరం తనను కొట్టిన వ్యక్తితో పోలీసులు బ్లూటూత్ తో మాట్లాడారని… ఆ తర్వాత తనపై దాడి జరిగిందని చెప్పారు.

తనపై దాడి చేసింది కేటీఆర్ మనిషేనని కేఏ పాల్ అన్నారు. తాను రైతులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పారు. అధికార పార్టీ కోసం పోలీసులు పని చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో నిన్న మాట్లాడానని… వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 28 స్థానాల కంటే ఎక్కువ రావనే విషయాన్ని కేసీఆర్ కు చెప్పినట్టు పీకే అన్నారని తెలిపారు. పీకేని పార్టీ పెట్టమని చెప్పింది కేసీఆరే అని అన్నారు.

Leave a Reply

%d bloggers like this: