Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నేపాల్ నైట్ క్లబ్ వివాదంలో రాహుల్ …కొట్టి పారేసిన కాంగ్రెస్!

నేపాల్ నైట్ క్లబ్ వివాదంలో రాహుల్ …కొట్టి పారేసిన కాంగ్రెస్!
-రాహుల్ నేపాల్ లో ఒక పెళ్ళికి వెళ్లారన్న కాంగ్రెస్ అధికారప్రతినిది

-నైట్ క్లబ్ లో రాహుల్ గాంధీ.. పక్కనున్న మహిళ ఎవరంటూ పెద్ద చర్చ..
-నేపాల్ లోని ఖాట్మండూ నైట్ క్లబ్ లో రాహుల్ గడిపినట్టు సమాచారం
-పక్కనున్న మహిళ నేపాల్ లో చైనా అంబాసడర్ అంటున్న కొందరు
-ఓ వివాహానికి హాజరయ్యేందుకు నేపాల్ కు రాహుల్ వెళ్లినట్టు సమాచారం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేపాల్ నైట్ క్లబ్ వివాదంలో చిక్కుకున్నారు . రాహుల్ గాంధీ నేపాల్ లోని ఒక పబ్ లో మహిళతో ఉన్నారని బీజేపీ ఫోటోలు విడుదల చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. తమనేత రాహుల్ నేపాల్ కు ఒక వివాహనిమిత్తం వెళ్లారని అక్కడ పెళ్ళిలో కుర్చీపై కూర్చుని ఉన్నారని అందులో తప్పేమి ఉందని కాంగ్రెస్ పేర్కొన్నది. బీజేపీ కావాలని రాహుల్ పై తప్పుడు ప్రచారానికి పూనుకున్నదని కాంగ్రెస్ దాన్ని కొట్టి పారేసింది. రాహుల్ గాంధీ నేపాల్ కు వెళ్లిన మాట నిజమేనని వివాహానికి వెళ్లడం తప్పు ఎలా అవుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ప్రశ్నించారు .

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేపాల్ నైట్ క్లబ్ లో ఉన్న వీడియో ఇప్పడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ ఉదయం నెట్ లో వీడియో ప్రత్యక్షం అయిన వెంటనే.. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో రాహుల్ పక్కన ఒక మహిళ కనిపిస్తున్నారు.

నేపాల్ లోని ఖాట్మండూ నైట్ క్లబ్ లో రాహుల్ గడిపినట్టు తెలుస్తోంది. పక్కనున్న మహిళ ఎవరనే విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. ఆమె నేపాల్ లోని చైనా అంబాసడర్ అని కొందరు అంటున్నారు. ఆమెతో కలిసి రాహుల్ పార్టీ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాహుల్ నేపాల్ లో ఉన్నట్టు ఖాట్మండు పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది.

మరోవైపు, మయన్మార్ లో నేపాల్ రాయబారిగా పని చేసిన భీమ్ ఉదాస్ తన కుమార్తె వివాహానికి రాహుల్ ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఆ వివాహానికి హాజరయ్యేందుకు ఆయన నేపాల్ కు వెళ్లారని కొందరు చెపుతున్నారు.

ఇంకోవైపు, ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన బీజేపీ జాతీయ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాళవీయ… రాహుల్ పై విమర్శలు గుప్పించారు. సొంత పార్టీలో రచ్చ జరుగుతుంటే రాహుల్ మాత్రం నైట్ క్లబ్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు.

Related posts

రేవంత్ ఆలా …కేటీఆర్ ఇలా …రేవంత్ ఉచిత విద్యత్ మాటలపై రాజకీయ దుమారం…

Drukpadam

‘ఆర్ఎస్ఎస్’పై సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఒవైసీ!

Drukpadam

రేవంత్ రెడ్డితో అధిష్ఠానం క్షమాపణ చెప్పించాలి: మంత్రి తలసాని..

Drukpadam

Leave a Comment