Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీలో ఇంట్రస్టింగ్ పాలిటిక్స్ …బాదుడే బాదుడు తో చంద్రబాబు టూర్!

ఏపీలో ఇంట్రస్టింగ్ పాలిటిక్స్ …బాదుడే బాదుడు తో చంద్రబాబు టూర్!
-కొత్తమంత్రులతో సంసారం చక్కదిద్దుకునే పనిలో సీఎం జగన్
-పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజి పై తలలు పట్టుకున్న అధికారులు
-విద్యుత్ కోతలపై ఉన్నతాధికారులతో సమీక్ష
-రోడ్ల మరమ్మత్తులకు భారీగా నిధులు
-పక్క రాష్ట్రాల విమర్శలతో పరేషాన్

ఏపీలో శాసనసభ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాల వ్యవధి ఉంది…కానీ తెలుగుదేశం అప్పుడే ఎన్నికలు వచ్చాయన్నట్లుగా ఉరుకులు పరుగులు పెడుతుంది… వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తున్నట్లు ప్రచారం చేసుకుంటుంది. పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తానని ప్రకటించారు. బీజేపీ పవన్ మాటలపై నోరు విప్పలేదు . అధికార పీఠం కోసం ప్రతిపక్షాలు కలిసి నడుస్తాయా? విడివిడిగా నడుస్తాయా ? అనేది తేలేందుకు మరికొంత కాలం ఆగక తప్పదు ….

దీనికి తోడు రాష్ట్రలో విద్యుత్ సంక్షోభం , పదవ తరగతి పరీక్షా పేపర్ లీకేజి , రోడ్ల మర్మత్తులపై వస్తున్నా విమర్శలు , పక్కరాష్ట్రం దెప్పి పొడుపులు వెరసి జగన్ సర్కార్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇటీవల కొత్తగా వచ్చిచేరిన మంత్రులతో అవగాహనాలోపం వాటిని చక్కదిద్దేపనిలో సీఎం జగన్ కేంద్రకరించడం కొత్తగా వస్తున్న సమస్యలు కోర్ట్ కేసులు రాజధానుల రగడ లాంటివి పరేషాన్ గా ఉన్నాయి.

ఈనేపథ్యంలో ఒకపక్క చంద్రబాబు , మరో పక్క పవన్ కళ్యాణ్ , ఇంకో పక్క బీజేపీ సర్కారుపై ముప్పేట దాడి చేస్తున్నాయి. మంచి చెడ్డల విశక్షణ పక్కనపెట్టి సర్కార్ ఏది చేసిన అందులో లోపాలు వెదికి సర్కార్ విధానాలపై సమరం సాగిస్తున్నాయి. దీనిలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా , విద్యుత్ చార్జీల పెంపు , ఆర్టీసీ చార్జీల పెంపు , రైతుల ,నిరుద్యోగుల , సమస్యలపై జిల్లా యాత్రలు చేపట్టారు . శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన చంద్రబాబు టూర్ కు అక్కడ టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మరో పక్క రైతు భరోసా పేరుతొ పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు . చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించి వారికీ లక్ష రూపాయలు అందజేస్తున్నారు . ఇది ఏపీ లో చర్చనీయాంశంగా మారింది. ఇక బీజేపీ తన వంతుగా సర్కారుపై విమర్శలు గుప్పిస్తుంది.

అధికారమనే పరుగు పందెంలో ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాల ఎత్తులను అధిగమించి తిరిగి అధికారం చేపడుతుందా ? లేక చతికల పడుతుందా ? అనేది ఆశక్తిగా మారింది.

Related posts

మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు…తీవ్రంగా పరిగణించిన బీజేపీ ఇద్దరిపై వేటు ….

Drukpadam

ఖమ్మం టీఆర్‌ఎస్‌ లో భారీ చేరికలు … మంత్రి పువ్వాడ

Drukpadam

షర్మిల ఖమ్మం సభ ఓకే … బట్ కండీషన్స్ అప్లై పోలిసుల మెలిక

Drukpadam

Leave a Comment