తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ విధానాల కార‌ణంగా 24 గంట‌లు విద్యుత్‌:ఎంపీ నామ

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ విధానాల కార‌ణంగా 24 గంట‌లు విద్యుత్‌
అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలే …ప్రధాని మోడీ సొంతరాష్ట్రం ఇందుకు మినహాయింపు కాదు
పండించిన పంటలను కొనటంలో కేంద్రం వైఫల్యం
రైతు బందు ఇచ్చి రైతులను ఆదుకున్న సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వ‌రరావు

భార‌తదేశంలో విద్యుత్ కొర‌త కార‌ణంగా ఏ రాష్ట్రంలోనూ క‌రెంటు లైట్లు వెలగ‌డం లేద‌ని టీఆర్ యస్ లోకసభ పక్ష నేత ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు . కేసీఆర్ దూరదృష్టి ,రాష్ట్రంపై ఆయనకు ఉన్న సమగ్ర అవగాహనతో 24 గంటలు విద్యుత్ కోతలు లేకుండా ఇవ్వగలుగుతున్న రాష్ట్ర ఒక్క తెలంగాణనే అని పేర్కొన్నారు . అందుకు సీఎం కేసీఆర్ విధానాలే కార‌ణ‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. బుధ‌వారం ఖ‌మ్మం జిల్లా మ‌ద్దుల‌ప‌ల్లి మండ‌లంలో నూత‌న వ్య‌వ‌సాయ క‌మిటీ భవనం శంకుస్థాపన కార్యక్ర‌మంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, తాతా మధు లతో కలిసి ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ నామ నాగేశ్వ‌రరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గృహ అవ‌స‌రాల‌కు కూడా నిరంత‌రాయంగా క‌రెంటు ఇస్తున్నార‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ సొంత రాష్ట్ట్రం గుజ‌రాత్‌లో కూడా విద్యుత్ ఇవ్వ‌డం లేద‌ని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్ర‌య‌త్నించే వ్య‌క్తి మ‌న ముఖ్య‌మంత్రి కేసీఆర్ అని ఆయ‌న గుర్తు చేశారు.

ఖ‌మ్మం జిల్లా ప్ర‌జానీకం ఓట్లు వేయ‌డంతో తాను లోక్‌స‌భ స‌భ్యుడిని అయ్యాయ‌ని అన్నారు. అందుచేత‌, రైతుల క‌ష్టాలు తీర్చేందుకు ఢిల్లీలో పోరాడుతున్న‌ట్టు వివ‌రించారు. మ‌న నాయ‌కుడు పోరాడి సాధించిన ఈ రాష్ట్రం బాగుండాల‌ని కోరుకునే వ్య‌క్తి అని కొనియాడారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్య‌క్ర‌మాలు రూప‌క‌ల్ప‌న చేశార‌న్నారు. రైతుల కోసం రైతు బంధు పెట్టార‌ని అన్నారు. వ‌ర్షాకాలం సాగు ప్రారంభం కాక‌మునుపే ఎరువులు కొర‌త లేకుండా య‌త్నిస్తుండ‌టం గొప్ప విష‌యం అన్నారు. ఈ ప్రాంతంలో మిర‌ప‌, ప‌త్తి పండిస్తున్నామ‌న్నారు. ఈ పంట‌ను పండించేందుకు క‌రెంటు, నీళ్ళను రాష్ట్ర‌ ప్ర‌భుత్వం అందిస్తున్నారు. కానీ, ఈ పంట‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం కొనాల్సి ఉన్నా, కొన‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ్య‌వ‌సాయ రంగాన్ని నాశ‌నం చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సాగు చ‌ట్టాలు తీసుకొచ్చింద‌ని ధ్వజమెత్తారు . రైతుల ఉద్య‌మం కార‌ణంగా ఆ సాగు వ్య‌తిరేక చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకున్నార‌ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కమల రాజ్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, డీసీసీబీ చైర్మన్ కూరకుల నాగభూషణం, డీసీఏంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర్లు, ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ వరప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లిడి అరుణ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు, మార్కెట్ పాలక వర్గ సభ్యులు, వ్యవసాయ అధికారులు, టి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

%d bloggers like this: