కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ లో చేరుతున్నారా ….?

కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ లో చేరుతున్నారా ….?
బండి సంజ‌య్‌తో కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి భేటీ…
జేపీ న‌డ్డా టూర్ నేప‌థ్యంలో భేటీకి ప్రాధాన్యం
మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో బండితో కొండా భేటీ
ఈ భేటీకి ముందు జితేంద‌ర్ రెడ్డితోనూ కొండా మీటింగ్‌
రేపు తెలంగాణ‌కు రానున్న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు
బీజేపీలో కొండా చేరతారా? అన్న దిశ‌గా విశ్లేష‌ణ‌లు

కొండా విశ్వేశ్వరరెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యుడు …టీఆర్ యస్ ను గద్దెదించాలనే గట్టిపట్టుదలతో ఉన్ననేత …కానీ ఏపార్టీ అయితే టీఆర్ యస్ గద్దె దిగుతుందని విషయంలో కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు . అందువల్ల అటు ఇటు తేల్చుకోలేకపోతున్నారు …. అంతకు ముందు ఆయన టీఆర్ యస్ లో ఉన్నారు .అనంతరం కాంగ్రెస్ లో చేరారు … తిరిగి కాంగ్రెస్ గూటికి రావాలని అనుకున్నారు …కానీ కాంగ్రెస్ లో ఉన్న గ్రూప్ తగాదాలతో ఆయన విసుగు చెందినట్లు ఉన్నారు . రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయినా తరవాత కాంగ్రెస్ లో చేరేందుకు కొంత మెత్తబడ్డట్లు కనిపించినా బీజేపీ నేతలతో సంబంధాలను కొనసాగిస్తున్నారు . ఈటల రాజేందర్ ఉపఎన్నికలలో సైతం టీఆర్ యస్ కు వ్యతిరేకంగా గట్టి పట్టుదలతో పనిచేశారు .ఇప్పుడు కాంగ్రెస్సా ? లేక బీజేపీ లో నా ? అనేది ఆయన ముందున్న ప్రశ్న …నేడు ప్రజాసంగ్రామ యాత్రలో ఉన్న బండి సంజయ్ ని కలిశారు . అంతకుముందు మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి తో సమావేశం అయ్యారు. బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా రాష్ట్రానికి వస్తున్నా నేపథ్యంలో వీరి కలయిక చర్చనీయాంశంగా మారింది…

కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌తో ప్ర‌త్యేకంగా భేటీ అవ్వడంతో ఆయన బీజేపీలో చేరుతున్నారా ? అనే ఆశక్తికర చర్చ జరుగుతుంది.. ప్ర‌స్తుతం ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో భాగంగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో బండి సంజ‌య్ ప‌ర్య‌టిస్తుండ‌గా… అక్క‌డికే వెళ్లిన విశ్వేశ్వ‌ర‌రెడ్డి ఆయ‌న‌తో భేటీ అయ్యారు.

ఈ భేటీకి ముందు బీజేపీకి చెందిన మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డితోనూ విశ్వేశ్వ‌ర‌రెడ్డి భేటీ అయ్యారు. ప్ర‌జా సంగ్రామ యాత్ర ముగింపు సంద‌ర్భంగా గురువారం నాడు మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో ఏర్పాటు చేయ‌నున్న స‌మావేశానికి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా హాజ‌రు కానున్నారు. ఆయన ప‌ర్య‌ట‌న‌కు ఓ రోజు ముందు ఇలా బీజేపీ కీల‌క నేత‌ల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తున్న కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి బీజేపీలో చేర‌తారా? అన్న దిశ‌గా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

Leave a Reply

%d bloggers like this: