Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాహుల్ నేపాల్ పర్యటన కాంగ్రెస్ కు నష్టమట …బీజేపీకి ఎందుకు భాద …?

రాహుల్ నేపాల్ పర్యటన కాంగ్రెస్ కు నష్టమట …బీజేపీకి ఎందుకు భాద …?
రాహుల్ పక్కన ఉన్న మహిళ చైనా రాయబారి కాదానంటున్న నేపాల్ మీడియా !
నేపాల్ లోని నైట్ క్లబ్లులో కనిపించిన రాహుల్
ఆమె చైనా రాయబారి అంటూ విజయసాయి సహా పలువురి కామెంట్లు
ఆమె సుమ్నిమా ఉదాస్ స్నేహితురాలని వెల్లడించిన ఓ జాతీయ మీడియా సంస్థ

రాహుల్ నేపాల్ పర్యటనపై పెద్ద దుమారం లేపిన బీజేపీ సోషల్ మీడియా ,ఆయనపై బురదచల్లేందుకు అడ్డగోలు అబద్దాలను వండివార్చిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి . కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు రాహుల్ విదేశీ పర్యటనలు ఏమిటని బీజేపీ ప్రశ్నించడం విడ్డురంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పుట్టిమునిగిపోతే సంతోషించాల్సిన బీజేపీ కాంగ్రెస్ మీద ప్రేమ కురిపిస్తూ ప్రకటనలు చేయడం వెనక ఆంతర్యం ఏమిటని ? సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ ను రాహుల్ బదనాం చేసేందుకు బీజేపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే అని కాంగ్రెస్ శ్రేణులు కొట్టి పారేస్తున్నాయి. ఒకపక్క విదేశీ పర్యటనలపై అభ్యంతరాలు , మరో పక్క రాహుల్ నైట్ క్లబ్ లో ఉన్నాడని ,అదికూడా ఒక మహిళా పక్కన ఉండగా తీసిన ఫోటో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు . రాహుల్ గాంధీ విదేశీ పర్యటన చేయడం తప్పా? లేక కాంగ్రెస్ కష్టకాలంలో ఉండగా చేయడం అభ్యంతరమా ? నైట్ క్లబ్ లో వివాహ విందు ఉండటం పొరపాటా? దేనిపై బీజేపీ కి అభ్యంతరాలు ఉన్నాయో చెప్పకుండా రాహుల్ విదేశీ పర్యటనలు చేస్తున్నారంటూ చెప్పటం బీజేపీ ద్వంద విధానాలకు నిదర్శనంగా ఉందని పరిశీలకులు అంటున్నారు.

రాహుల్ గాంధీ పక్కన ఓ మహిళ ఉండటం తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది.

అయితే, రాహుల్ పక్కన ఉన్న మహిళ ఎవరనే విషయంపైనే ఎక్కువ చర్చ నడిచింది. ఆమె నేపాల్ లోని చైనా రాయబారి హౌ యాంకీ అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో పాటు పలువురు నేతలు పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి మరో అడుగు ముందుకేసి ‘చైనా హనీ ట్రాప్’ అనే పదాన్ని కూడా వాడారు.

మరోవైపు ఈ అంశానికి సంబంధించి ఓ జాతీయ మీడియా సంస్థ ఫ్యాక్ట్ చెక్ చేయగా… ఆమె చైనా రాయబారి కాదని తేలింది. ఆయన పక్కనున్న మహిళ సీఎన్ఎన్ మాజీ జర్నలిస్ట్ సుమ్నిమా ఉదాస్ స్నేహితురాలని, ఆమె నేపాల్ జాతీయురాలని సదరు మీడియా సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని నైట్ క్లబ్ యజమాని వెల్లడించారని పేర్కొంది. క్లబ్ కు రాహుల్ తో పాటు మరో ఐదారుగురు స్నేహితులు వచ్చారని… వీరిలో ఏ ఒక్కరూ చైనీయులు కాదని ఆయన స్పష్టం చేసినట్టు తెలిపింది. దాదాపు గంటన్నర సేపు రాహుల్ నైట్ క్లబ్ లో ఉన్నట్టు పేర్కొంది.

సుమ్నిమా వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ నేపాల్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. విందును నైట్ క్లబ్ లో ఏర్పాటు చేయగా.. ఆ సమయంలో రాహుల్ అక్కడున్న సందర్భంలో తీసిన వీడియో దుమారం రేపింది. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రాహుల్ నైట్ క్లబ్ లో ఉన్నారంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్నేహితురాలి వివాహానికి వెళ్లడం నేరం కాదు కదా? అని ప్రశ్నించింది.

Related posts

అమెరికాకు దన్నుగా కెనడా నిర్ణయం …బీజింగ్ వింటర్ ఒలంపిక్స్ కు దౌత్య బహిష్కరణ!

Drukpadam

Drukpadam

ఐటీ ,ఈడీ దాడులకు రాజకీయ రంగు …

Drukpadam

Leave a Comment