తెలంగాణ సర్కార్ అవినీతిలో కూరుకుపోయింది :జెపి నడ్డా !

తెలంగాణ సర్కార్ పై బీజేపీ జాతీయ అధ్యక్షడు జెపి నడ్డా సంచలన వ్యాఖ్యలు!
-కాళేశ్వ‌రం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంగా మారిందని ధ్వజం
-టీఆర్ఎస్ అంటే తెలంగాణ ర‌జాకార్ స‌మితి అంటూ విమర్శలు
-మిష‌న్ భ‌గీర‌థ‌లోనూ భారీ అవినీతి జరిగిందని ఆరోపణ
-తెలంగాణ స‌ర్కారు అవినీతిలో కూరుకుపోయింద‌న్న న‌డ్డా

బీజేపీ తెలంగాణ సర్కారుపై తీవ్ర దాడికి పూనుకున్నది . రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మొదటి దశ ముగింపు సభకు హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు . కేసీఆర్ సర్కార్ పూర్తిగా అవినీతిలో కురుకుపోయిందన్న జెపి నడ్డా కాళేశ్వరం ప్రాజెక్టు ఏ టి ఎం గా మారిందని విమర్శలు గుప్పించారు . మిషన్ భగీరథలోను భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు . ఈ సర్కార్ కొనసాగితే మొత్తం రాష్ట్రం దివాళా తీయటం ఖాయమని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు తెలంగాణ రజాకార్ సమితికి చరమ గీతం పడాలని పిలుపు నిచ్చారు . భారతీయజనతా పార్టీ ఆధ్వర్యంలోనే తెలంగాణ ప్రజలు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు .

  • జేపీ న‌డ్డా తీవ్ర వ్యాఖ్య‌లు తెలంగాణ రాజకీయాల్లో మరింత హీట్ పుట్టించాయి . బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ గత నెలరోజులుగా చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర తొలి ద‌శ పూర్తయిన సంద‌ర్భంగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రైన జేపీ న‌డ్డా తెలంగాణ ప్ర‌భుత్వంపైనా, టీఆర్ఎస్‌పైనా, సీఎం కేసీఆర్‌పైనా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

తెలంగాణ ప్ర‌భుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింద‌ని న‌డ్డా ఆరోపించారు. తెలంగాణ‌లోనే అతి పెద్ద ప్రాజెక్టుగా ఉన్న కాళేశ్వ‌రం సీఎం కేసీఆర్‌కు ఏటీఎంలా మారింద‌ని కూడా ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. మిష‌న్ భ‌గీర‌థ‌లో కూడా పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంద‌ని ఆయ‌న ఆరోపించారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర స‌మితి కాద‌ని, తెలంగాణ రజాకార్ స‌మితి అని కూడా మ‌రింత ఘాటు ఆయన వ్యాఖ్య‌లు గుప్పించారు.

Leave a Reply

%d bloggers like this: