సీఎంని వాడు, వీడు అంటే నాలుక చీరేస్తాం: బండి సంజయ్ కి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్!

సీఎంని వాడు, వీడు అంటే నాలుక చీరేస్తాం: బండి సంజయ్ కి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్!

  • కేసీఆర్ ఒక పులి లాంటి వ్యక్తి అన్న శ్రీనివాస్ గౌడ్ 
  • పాలమూరును విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపణ 
  • రాష్ట్రంపై బీజేపీ తొలి నుంచి ద్వేషాన్ని ప్రదర్శిస్తూనే ఉందని విమర్శ 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని, మంత్రులను పట్టుకుని వాడు, వీడు అంటే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ ఒక పులి లాంటోడని అన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అన్నా, కేసీఆర్ కు తెలంగాణ ప్రజలన్నా పంచ ప్రాణాలని చెప్పారు. పాదయాత్రల పేరుతో పచ్చగా ఉన్న పాలమూరును విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మతాలు, కులాల పేరిట రాజకీయం చేయడం సరికాదని అన్నారు.

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంపై బీజేపీ ద్వేషాన్ని ప్రదర్శిస్తూనే ఉందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడగానే ఏపీకి ఏడు మండలాలు, సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని కట్టబెట్టిందని విమర్శించారు. ఒక లుచ్చా మాదిరి, ఒక వీధి రౌడీ మాదిరి మాట్లాడుతున్న బండి సంజయ్ కి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిన వారెవరో అని ఎద్దేవా చేశారు. ‘సీఎంను, మంత్రులను పట్టుకుని వాడు, వీడు అంటావారా సంజయ్… ఎవడ్రా నీకు సంస్కారం నేర్పింది?’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

%d bloggers like this: