కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన వరంగల్ రాహుల్ సభ!

కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన వరంగల్ రాహుల్ సభ!
-కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజం
-కేసీఆర్ పాలనా రాజరికాన్ని తలపిస్తున్నది విమర్శ
-వేలకోట్ల అవినీతి జరిగిన బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్న
-వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులకు దగ్గరైయ్యేందుకు కాంగ్రెస్ ప్రయత్నం
-ఎవరితోనూ కాంగ్రెస్ కు పొత్తులు ఉండవని రాహుల్ స్పష్టికరణ
-పనిచేసేవారికి టికెట్స్ ఇస్తామని హామీ

చాలాకాలం తరవాత వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వించిన రాహుల్ సభ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. రైతులకు ఒక పక్క భరోసా ఇచ్చేందుకు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పక్క రాష్ట్రమైన ఛత్తీస్ ఘడ్ లాగా ఇక్కడ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని , పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వడంతో పాటు కల్తీ విత్తనాలు , మందుల అమ్మకాలపై కఠిన చట్టాలు తెస్తామని హామీ ఇచ్చింది.

సభలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై మండి పడ్డారు . ఇందుకేనా తెలంగాణ ఇచ్చిందని నిలదీశారు . ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంటే , కేవలం కుటుంబం కోసం అధికారాన్ని ఉపయోగిస్తూ కోట్ల రూపాయలు దోచుకుంటున్న దొంగ కేసీఆర్ అంటూ కేసీఆర్ పాలనను దుయ్యబట్టారు . సీఎం అంటే ప్రజల మాటలు విని వారి అవసరాలు తీర్చేవాడుగా ఉండాలని కానీ కేసీఆర్ ఆలా కాకుండా రోజులగా తన బుర్రలో పుట్టిన ఆలోచనలను అమలు చేస్తూ రాజు లాగా నియంత లాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు .

తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న దొంగ ఎవరు? అంటూ ప్రశ్నించారు. తెలంగాణను దోచుకున్న వ్యక్తులతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని ఎలా అనుకున్నారు? ఈ పొత్తుపై కాంగ్రెస్ నేతలు ఎవరు మాట్లాడినా వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తాం అని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఎంత పెద్దవారైనా ఈ విషయంలో ఉపేక్షించేది లేదని తెలిపారు.

ఒకవేళ ఎవరైనా కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ తో పొత్తుకు ఇష్టపడితే వారు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోవచ్చని సూచించారు. అటువంటి నేతలు తమకు అవసరంలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఓడించడం ఖాయమని, హస్తం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని అన్నారు. ప్రజల కోసం, రైతుల కోసం పోరాడని నేతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇచ్చేది లేదని రాహుల్ తేల్చిచెప్పారు. ప్రజల్లో ఉండి సేవ చేసే వ్యక్తికే టికెట్ ఇస్తామని అన్నారు.

తెలంగాణ వల్ల ఒకే ఒక కుటుంబం బాగుపడింది: రాహుల్ గాంధీ

తెలంగాణ ఏ ఒక్కరి వల్లో రాలేదని, తెలంగాణ ఏ ఒక్కరి కోసమే ఏర్పడలేదని అన్నారు. ఎంతోమంది త్యాగాలతో తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు. కానీ ఒక్క కుటంబమే బాగుపడిందని ఇది కాంగ్రెస్ పార్టీ అంటున్నమాట కాదని ప్రజలు అంటున్న మాటలను పేర్కొన్నారు .

ఈ వేదికపై భర్తల్ని కోల్పోయిన రైతుల భార్యలు ఉన్నారని, వారి దీన కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. రైతుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వారి కుటుంబ సభ్యుల వేదనకు ఎవరు కారణం? అని నిలదీశారు. ఇలాంటి బాధిత రైతు కుటుంబాలు రాష్ట్రమంతా ఉన్నాయని వెల్లడించారు.

“తెలంగాణ కోసం ఎందరో పోరాటాలు చేశారు. రక్తాన్ని, కన్నీళ్లను చిందించారు. వారితో పాటు కాంగ్రెస్ కూడా పోరాడింది. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజల కల నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీనే. ఎవరు బాగుపడతారని తెలంగాణ ఇచ్చామో వారు బాగుపడలేదు. తెలంగాణ ఇస్తే ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని భావించాం.ఈ ముఖ్యమంత్రి ఒక రాజులా నియంతలా పరిపాలిస్తున్నాడు. పేరుకే ఆయన ముఖ్యమంత్రి… రాష్ట్రంలో రాజరికం నడుస్తోంది” అంటూ రాహుల్ విమర్శలు చేశారు.

Leave a Reply

%d bloggers like this: