ఈత కొలను స్నానాల గదిలో రహస్యంగా కెమెరా..

ఈత కొలను స్నానాల గదిలో రహస్యంగా కెమెరా.. దుస్తులు మార్చుకుంటున్న యువతులకు అనుమానం రావడంతో వెలుగులోకి!

  • సూర్యాపేట జిల్లాలో ఘటన
  • ఈత కొలనులో పనిచేస్తున్న యువకుడి నిర్వాకం
  • తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు  

స్నానాల గదిలో సెల్‌ఫోన్ కెమెరాతో రహస్యంగా యువతులను చిత్రీకరిస్తున్న యువకుడి బండారం బయటపడింది. సూర్యాపేట జిల్లాలో జరిగిందీ ఘటన. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చివ్వెంల మండలం కుడకుడ గ్రామ పరిధిలోని ఓ ఈత కొలనులో గుగులోతు మహేశ్ అనే యువకుడు పనిచేస్తున్నాడు.

మంగళవారం తన మొబైల్ కెమెరాను ఆన్‌చేసి రహస్యంగా అక్కడి స్నానాల గదిలో పెట్టాడు. అదే రోజు ఇద్దరు యువతులు స్నానాల గదిలో దుస్తులు మార్చుకుంటున్న సమయంలో అనుమానంతో పరిశీలించగా కెమెరా ఆన్‌‌చేసి ఉన్న మొబైల్ ఫోన్ కనిపించింది. దీంతో యువతులు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

%d bloggers like this: