కర్ణాటకలో సీఎం కుర్చీ మహాకాస్టలీ అంటున్నకేటీఆర్!

కర్ణాటకలో సీఎం కుర్చీ మహాకాస్టలీ అంటున్నకేటీఆర్!
కర్ణాటకలో సీఎం కావాలంటే రూ.2,500 కోట్లు
ఈ విష‌యాన్ని బీజేపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారన్న కేటీఆర్
40 శాతం కమిషన్‌ ఇవ్వాలని గుత్తేదారులు అడుగుతున్నార‌ని విమ‌ర్శ‌
అలాగే, 30 శాతం కమిషన్‌ ఇవ్వాలని హిందూ మఠం వారూ అడుగుతున్నార‌ని వ్యాఖ్య‌
ఆ అంశాల‌పై ఎలా స్పందిస్తారని జేడీ న‌డ్డాను నిల‌దీత‌

కర్ణాటకలో సీఎం కుర్చీకి బీజేపీ లో మహాగిరికిఉందట..ఈ విషయాన్నీ అక్కడ బీజేపీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు . తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీ ముఖ్యమంత్రి పదవి అమ్ముకుంటుందని ధ్వజమెత్తారు .

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘కర్ణాటకలో సీఎం కావాలంటే రూ.2,500 కోట్లు అడుగుతున్నారట‌’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విష‌యాన్ని బీజేపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని ఆయ‌న అన్నారు. తాము 40 శాతం కమిషన్‌ ఇవ్వాల్సి ఉంద‌ని గుత్తేదారులు, తాము 30 శాతం కమిషన్‌ ఇవ్వాల్సి ఉంద‌ని హిందూ మఠం వారు అంటున్నారని తెలిపారు.

ఆ అంశాల‌పై ఎలా స్పందిస్తారని జేడీ న‌డ్డాను నిల‌దీశారు. వ‌స్తోన్న విమర్శ‌ల‌ను అణ‌చివేసేందుకు ఈడీ, ఐటీ, సీబీఐలను పంపిస్తారా? అంటూ చుర‌క‌లంటించారు. ఈ సంద‌ర్భంగా కర్ణాటకలో సీఎం కావాలంటే రూ.2,500 కోట్లు అడుగుతున్నారంటూ బీజేపీ నేత అన్నారని వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని ఈ సంద‌ర్భంగా కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే, దేశంలో గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచారంటూ వ‌చ్చిన మ‌రో వార్త‌ను కూడా కేటీఆర్ పోస్ట్ చేశారు. మ‌రోసారి ధ‌ర‌లు బాదారంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

Leave a Reply

%d bloggers like this: