Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ తెలంగాణ పర్యటన …పెరిగిన రేవంత్ ప్రతిష్ట!

రాహుల్ తెలంగాణ పర్యటన …పెరిగిన రేవంత్ ప్రతిష్ట!
-అధికార టీఆర్ యస్ పై శివాలు…పార్టీ నాయకులకు వార్నింగ్
-బీజేపీ …టీఆర్ యస్ రెండు ఒకటే అని ధ్వజం
-ఎవరితోనూ పొత్తులు ఉండవని స్పష్టం
-పనిచేసేవాళ్ళకే టికెట్స్ వస్తాయన్న రాహుల్
-టికెట్స్ కోసం పైరవీలు ఢిల్లీ ,హైద్రాబాద్ తిరగొద్దని సలహా

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఎంపీ రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ టూర్ ముగిసింది.ఈ పర్యటన జయప్రదం చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. రాహుల్ సైతం ప్రతి విషయంలో రేవంత్ తో మాట్లాడుతూ కనిపించరు .అప్పుడప్పుడు ,సీఎల్పీ నేత భట్టి , ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు రాహుల్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారు . మిగతా నేతలంతా కార్యక్రమాన్ని ప్రజల మూడ్ ను జాగ్రత్తగా పరిశీలించారు . గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద బహిరంగ సభ పెట్టలేదు . సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ లో జోష్ నింపింది.

శుక్రవారం సాయంత్రం రాష్ట్రానికి వచ్చిన రాహుల్ శంషాబాద్ నుంచి నేరుగా వరంగల్ వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పాల్గొన్నారు . కాంగ్రెస్ పార్టీ అంచనాలకు తగ్గట్లు గా ప్రజలు ప్రధానంగా రైతులు ఈ సభకు హాజరు కావడంతో కాంగ్రెస్ నాయకులూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు .

ఇక ఈ సభ జయప్రదం కావడంతో రేవంత్ ప్రతిష్ట మరింత పెరిగింది. రాహుల్ సైతం పీసీసీ అధ్యక్షుడు గా ఉన్న రేవంత్ కు , సీఎల్పీ నేత భట్టికి , ఇచ్చిన ప్రాధాన్యత మిగతా నేతలకు ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . ప్రతి విషయాన్నీ రేవంత్ రేవంత్ అడిగి తెలుసుకోవడం పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. రాహుల్ సభలో ప్రసంగించిన తీరు బాగుందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. రైతులు , నిరుద్యోగులు , కార్మికులు , కర్షకులు , పేదల గురించి రాహుల్ ప్రస్తావించారు .ప్రజల మేలు కోసం నీళ్లు , నిధులు , నియామకాలు గురించి తెలంగాణ ఇస్తే అందుకు విరుద్ధంగా ఇక్కడ పాలన సాగుతుందని ,అది అవినీతితో కూడుకొని ఉందని కేసీఆర్ పాలనపై రాహుల్ నిప్పులు చేరగటం సభికులను ఉత్సాహపరించింది. టీఆర్ యస్ బీజేపీ లు ఒకటేనని ,బీజేపీ చేతిలో కేసీఆర్ రిమోట్ లా పని చేస్తున్నారని రాహుల్ చేసిన ఆరోపణలు ప్రజలను ఆలోచింప జేశాయి.

గీతదాటితే వేటే …పార్టీ నాయకులూ ఎవరు పొత్తులు గురించి మాట్లాడవద్దన్న రాహుల్ ఎవరైనా పార్టీ నిర్ణయానికి భిన్నంగా గీత దాటితే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు . ఇందులో చిన్న పెద్ద తేడా లేదని ఎంతటి పెద్దవారైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడాల్సిందేనని ఘాటుగా హెచ్చరించారు .
రెండవరోజు సంజీవయ్య కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ అంతకు ముందు తెలంగాణ ఉద్యమకారులైన ప్రొఫెసర్ హరగోపాల్ , గద్దర్ , చెరుకు సుధాకర్ , కంచె ఐలయ్య తదితరులతో మాట్లాడాడు . తరువాత గాంధీ భవన్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు . ఆ సమావేశంలో పార్టీని అధికారంలో కి తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి దిశా నిర్ధేశం చేశారు . అక్కడ నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లారు . మొత్తం మీద కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ టూర్ తరువాత కొత్త ఉత్సాహంతో ఉన్నాయి. రేవంత్ ప్రతిష్ట పెరిగింది. …

Related posts

వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై రాజీలేని పోరాటం : ఎంపీ నామా

Drukpadam

అందుకే తెలంగాణ ప్రజలు రాష్ట్ర విభజన కోరుకున్నారు: ధర్మాన ప్రసాదరావు

Drukpadam

ఎమ్మెల్యే పదవికి ఈటల గుడ్ బై …వెంటనే ఆమోదించిన స్పీకర్ పోచారం

Drukpadam

Leave a Comment