ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక్కటౌతాయా ?

ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక్కటౌతాయా ?
బాబు ..పవన్ కళ్యాణ్ వ్యూహం ఫలిస్తుందా ?
బీజేపీ బాబు కూటమితో కలుస్తుందా ?
వామపక్షాలు బీజేపీ ఉన్న కూటమితో జతకడతాయా ?
ఏపీ లో పొత్తుల ఎత్తులతో బాబు …
సింగిల్ గానే అంటున్న వైసీపీ
ఎన్నికలలకు మరో రెండు సంవత్సరాలు
అప్పుడే మొదలైన ఎన్నికల హడావుడి

ఏపీ లో రాజకీయాలు రంజుగా ఉన్నాయి…అధికారంలో ఉన్న వైసిపిని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు అన్ని ఒక్కటి కావాలని అటు పవన్ కళ్యాణ్ , ఇటు చంద్రబాబు పిలుపునిచ్చారు .దీనికి మిగతా పక్షాలనుంచి వచ్చే స్పందన ఏమిటి ? ఉత్తర దక్షణ దృవాలుగా ఉన్న బీజేపీ , లెఫ్ట్ పార్టీలు ఇందులో కలుస్తాయా ? తెలుగుదేశంతో సర్దుకు పోయేందుకు బీజేపీ సిద్దపడుతుందా ?కేవలం వైసీపీ పై గుద్ది వ్యతిరేకతతో ప్రతిపక్షలు అన్ని ఒక్కటి అవుతున్నాయని ప్రజలు భావిస్తే వీరి ఎత్తుగడలు వమ్ము అవుతాయి కదా ? బీజేపీని టీడీపీ ని పవన్ కళ్యాణ్ కలపగలరా ? అందుకు బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించగలరా ? అని ప్రశ్నలకు సమాదానాలు రావాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి

ఏపీ లో వైసీపీ ని గద్దె దించేందుకు ప్రతిపక్షాలను ఏకం చేయాలనీ టీడీపీ నేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు . అవి ఒక్కటౌతాయా ? అనేదానిపై ఆశక్తి నెలకొన్నది .

అధికారంలో ఉన్న వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారని , విద్యుత్ చార్జీలు ,ఇంటిపన్నులు.డీజిల్ ,పెట్రోల్ రేట్లతో సామాన్యులు అల్లాడి పోతున్నారని , పోలీస్ నిర్బంధాలు , హత్యలు , ఆత్మహత్యలు , అత్యాచారాలు ఎక్కువైయ్యాయని అందువల్ల అధికారంలో ఉన్న వైసిపిని గద్దె దించాల్సిందే అని కంకణం కట్టుకొని ఉన్నారు . ప్రజాభీష్టానికి విరుద్ధంగా మూడు రాజధానుల పేరుతొ అమరావతిని అభివృద్ధి లేకుండా చేశారని దుమ్మెత్తి పోస్తున్నారు . అందుకు తక్షణమే జగన్ సర్కార్ ను సాగనంపాల్సిందే అని నిర్దారణకు టీడీపీ , జనసేన వచ్చాయి. రాష్ట్రంలో ఉన్న బీజేపీ , లెఫ్ట్ పార్టీలతో కూడా సంప్రదించి అందరం ఒక్కటైయి ఎన్నికల్లో జగన్ ను ఓడించి కూటమి సర్కార్ ను అధికారంలోకి తీసుకోని రావాలని ఎత్తులు వేస్తున్నారు . ఇంతవరకు బాగానే ఉన్నా అది సాధ్యం అవుతుందా ? అనే సందేహాలు వెంటాడుతున్నాయి.

కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామని అన్నారు . ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే డైలాగ్ అందుకున్నాడు . దీంతో బాబు ,పవన్ కళ్యాణ్ ఒక్కటే అనే వైసీపీ వాదనకు బలం చేకూరినట్లు అయింది. మరి బీజేపీ తో ఉన్నా పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా తీసుకోని టీడీపీ తో కూటమి కడతారా ? లేక బీజేపీ ని వదిలేసి టీడీపీ తో కూటమి కడతారా ? అనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధిష్టానం జగన్ తో సత్సబంధాలను కలిగిఉంది. అందువల్ల రేపు పరిస్థితులు మారితే తప్ప చంద్రబాబు , బీజేపీ కలయిక అంత తేలిక కాదు . ఒకవేళ బీజేపీ కూడా బాబు , జనసేన కూటమిలో చేరితే లెఫ్ట్ పార్టీలు అందులో చేరకపోవచ్చు .లెఫ్ట్ పార్టీల బలమెంత అనేది పక్కనపెడితే బీజేపీ ఉన్న కూటమిని టార్గెట్ గా ప్రచారం చేసే అవకాశం ఉంది. అప్పడు లెఫ్ట్ వ్యతిరేక ప్రచారం బీజేపీ ,టీడీపీ , జనసేన కూటమికి మైనస్ గా మారుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

వైసీపీ కి ప్రజల్లో సానుభూతి తగ్గిందా ? అంటే ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఓట్ల శాతం తగ్గలేదు . 2019 ఎన్నికలకంటే అధికశాతం ఓట్లు వచ్చాయి. అయితే అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక ఎన్నికల అడ్వాంటేజ్ గా ఉంటాయనుకున్నా కొంత తేడా వచ్చే అవకాశం ఉంది. దీనిప్రకారం సీట్లు తగ్గితే ఎన్ని తగ్గుతాయి. ప్రతిపక్షాల ప్రభావం ఎంత ఉంటుంది? అనేదానిపై ఆధారపడి జగన్ సర్కార్ అధికారం దక్కించుకుంటుందా ? లేదా అనేది ఉంటుంది. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఎత్తులు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి !

 

 

Leave a Reply

%d bloggers like this: