మార్పుతెచ్చే ఆయుధం జర్నలిస్టు కలమే….మంత్రి పువ్వాడ

మార్పుతెచ్చే ఆయుధం జర్నలిస్టు కలమే….
-ఇళ్ళ స్ధలాలను ఇప్పించే బాధ్యత నాదే
-జర్నలిజంలో పడిపోతున్న విలువలను కాపాడాలి
ప్రజలకు సేవచేసే నాయకులను కాపాడుకోవాల్సిన భాద్యత జర్నలిస్టులదే
-టియుడ బ్ల్యుజె ఐజెయు ఖమ్మం నగర మహా సభలో మంత్రి పువ్వాడ

దేశంలో రాష్ట్రంలో మెరుగైన సమాజం కోసం మార్పు తెచ్చేందుకు జర్నలిస్టుల కలమే ఒక ఆయుధమని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆధివారం ఖమ్మం నగరంలోని డిపిఆర్ సి భవనంలో జరిగిన ఖమ్మం నియోజకవర్గ టియుడబ్ల్యుజె (ఐ జె యు )మహా సభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.దేశ వ్యాప్తంగా ఉన్న టియుడబ్ల్యుజె ఐ జె యు ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.నిబద్దత గల నాయకులు ,తనకు తెలిసిన శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు ఇందులో ఉన్నారని ఈ సంఘాన్ని చాలాకాలంగా దగ్గరగా చూస్తున్నానని కొనియాడారు .

ఈ సంఘం ఖమ్మం నియోజకవర్గ స్ధాయిలో గొప్పగా సంఘం మహాసభలను నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం క్రషి చేస్తానని ఆయన హామి ఇచ్చారు.ప్రధానంగా ఇళ్ళ స్ధలాలు ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని అన్నారు.అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలను ఇప్పించే సంకల్పం తాను ,సి ఎం తీసుకున్నామని పేర్కోన్నారు.గతంలో ముఖ్యమంత్రి కె సి ఆర్ ఇచ్చిన హామిని తప్పనిసరిగా నెరవేర్చుతానని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ఎసి బస్సుల్లో జర్నలిస్టుల బస్ పాస్ చెల్లుబాటు విషయంలో ఆర్టీసి సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేస్తే తనకు వెంటనే ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు.

 

 

మీడియాలో వస్తున్న మార్పులు అనారోగ్యకరంగా ఉంటున్నాయని అన్నారు.వార్తల విషయంలో యాజమన్యాల ప్రాధాన్యతే జర్నలిస్టుల ప్రాధాన్యతగా మారిందని దేశ వ్యాప్తంగా ఇదే ఒరవడి కొనసాగుతుందని మంత్రి అన్నారు.సోషల్ మీడియా వచ్చిన తరువాత బురదజల్లే అసత్యవార్తలు చక్కర్లు కొట్టిన తరువాత అది నిజం కాదని వివరణ ఇచ్చుకోవడానికే అనేక మంది నాయకుల విలువైన సమయాన్ని వెచ్చించాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అలాకాకుండా వాస్తవాలను శోధించి వార్తగా ప్రచురిస్తే బాగుంటుందని ఆ విధమైన నియంత్రణ ఫ్రింట్ మీడియాలో ఉందనే విషయాన్ని తాను నమ్ముతున్నానని అన్నారు.అయినప్పటికి కొంతమంది మీడియా మిత్రులు సంచలనం కోసం వాస్తవాలను పక్కదారి పట్టించే కథనాలను రాస్తున్నారని అన్నారు ఎంతో పోరాట చరిత్ర కలిగిన టియు డబ్ల్యుజె ఐజెయు సంఘం వార్తలపై నియంత్రణ పై ఒక తీర్మాణం చేయాలని ఆయన సూచించారు.జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలను ఇప్పించాలనేది తన ధ్రడ సంకల్పమని అది ఏ విధంగా నెరవేర్చుతాననే విషయాన్ని కార్యచరణద్వారా తెలియజేస్తానని ఆయన పేర్కొన్నారు. ముందుగా తెలియజేస్తే ఆ సంకల్పం పూర్తికాకుండా అడ్డుకునే శక్తులు,వ్యక్తులు ఉన్నారని ఆయన చెబుతూ గుడిసెలు వేసుకున్న రెండువేల మంది నిరుపేదలకు ఇళ్ళ పట్టాలను ఇప్పించానని దానిపై కూడా స్టే తెచ్చేందుకు ఒక జాతీయ పార్టీ కి చెందిన అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నాడని అన్నారు.ఈ ఇళ్ళ స్ధలాల కేటాయింపు విషయాన్ని గొప్యంగా ఉంచి కేవలం అప్పటి కలెక్టర్ తో మాత్రమే మాట్లాడి పూర్తి చేశానని ఆయన గుర్తు చేశారు.
అందుకే జర్నలిస్టుల ఇళ్ళ స్ధలాల కేటాయింపు విషయాన్నితన కార్యచరణ ద్వారానే తెలియజేస్తానని మంత్రి పేర్కొన్నారు.

మీడియా ఎవ్వరి కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉందో ఆర్ధం చేసుకోగలమని అంటూ వార్తలు ,విశ్లేషణలు రాసే సీనియర్ జర్నలిస్టులు ప్రజలకు సేవలు చేసే నిజమైన నాయకులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.మంచి చేసే వారి పట్ల కూడా అసత్యవార్తలు ప్రచురించడం ద్వారా మంచి నాయకులు దూరం అవుతారని అది అంతిమంగా ప్రజలకు నష్టం కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఖమ్మం నగర అభివ్రద్ది గురించి అందరూ చెప్పుకునే స్ధాయిలో తాను క్రషి చేస్తున్నట్లు చెప్పారు.నగరంలోని ప్రతి పౌరుడు నాది ఖమ్మం అని సగర్వంగా చెప్పుకునే విధంగా అభివ్రద్ది జరుగుతుందని అన్నారు.అభివ్రద్దిని అడ్డుకునేందుకు ఎవ్వరూ ప్రయత్నించినా వెనక్కితగ్గేదేలేదు అని అన్నారు రాజకీయాల్లో ఒడిదుడుకులు ఇబ్బందులు ఎదుర్కోవడం తమకు కొత్త కాదని,తన తండ్రి పువ్వాడ నాగేశ్వర్ రావు రాజకీయ జీవితమే తనకు పెద్దబాలశిక్ష లాంటిదని ఆయన పేర్కొన్నారు.జర్నలిస్టుల కు ఇళ్ళ స్ధలాల కేటాయింపు విషయంలో అవకాశాలను బట్టి ప్రాధాన్యత క్రమాన్ని తనకు జర్నలిస్టుల సంఘాలు సూచించడంలో సహాయ పడాలని ఆయన విజ్ణప్తి చేశారు.

ఇక అక్రిడేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వానికి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయని అంటూ వాటిని సవరించుకొని జర్నలిస్టుల సంఘాలు కొరిన విధంగానే ఇచ్చే ప్రయత్నం చేసేందుకు తన వంతు క్రషి చేస్తానని అన్నారు.

పోరాటం ద్వారానే హక్కుల సాధన:
సి ఎం హామి నెరవేరలేదు: రాంనారాయణ

పోరాటాల ద్వారానే జర్నలిస్టుల హక్కుల సాధన సాధ్యపడుతుందని టియుడబ్ల్యుజె ఐజెయు రాష్ర్ట ఉపాధ్యక్షులు కె రాంనారాయణ అన్నారు.ఈ మహాసభలో ఆయన ప్రసంగిస్తూ
దేశంలో ,రాష్ట్రంలో జర్నలిస్టులపైదాడులు పెరిగిపోయయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న పాలకులు జర్నలిస్టులు సాధించుకున్న హక్కులను కూడా కాపాడటంలో విఫలం అవుతున్నారని ఆయన విమర్శించారు
జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేసే ఏకైక సంఘం టియుడబ్ల్యుజె ఐజెయు మాత్రమేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో 20వేల మంది జర్నలిస్టులు ఉంటే 14వేల మంది టియుడబ్ల్యుజె ఐజెయు సంఘంలో సభ్యులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు జర్నలిస్టుల పట్ల కొంత సానుకూల వైఖరితో పనిచేశాయని ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రభుత్వాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇళ్ళ స్ధలాల కేటాయింపు విషయంలో గాని, హెల్త్ కార్డుల విషయంలోగాని జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్ధానమే ఖమ్మం లో ఇప్పటి వరకు నెరవేరలేదని ఆయన అన్నారు హెల్త్ కార్డ్ ను తీసుకొని ఆసుపత్రికి వెళ్తే ఆ కార్డు పై వైద్యం చేయడం సాధ్యం కాదని వైద్యులు తిప్పి పంపుతున్న విషయాన్ని ఆయన మంత్రి ద్రష్టికి తీసుకొచ్చారు. జిల్లా టాబ్లాయిడ్స్ లేని పత్రికలకు మండల స్ధాయి అక్రిడేషన్లను రద్దు చేయాలనే యోచన ప్రభుత్వం చేస్తున్నట్లు తమ సంఘం ద్రష్టికి వచ్చినట్లు పేర్కొంటూ అటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే టియుడబ్ల్యుజె ఐజేయు ఆధ్వర్యంలో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయకతప్పదని అన్నారు.జర్నలిస్టులకు న్యాయం జరిగేవిధంగా క్రషి చేయాలని ఆయన కోరుతూ ప్రెస్ కౌన్సిల్ జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని , మీడియా కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.రైల్వే పాసుల జారీ విషయంలో కూడా రైల్వే శాఖ ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు.

టియుడబ్ల్యుజె ఐజెయు నగర కన్వీనర్ మైపా పాపారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు,నగర మేయర్ పునుకొల్లు నీరజ,సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,మార్కేట్ కమిటి చైర్మన్ డి లక్ష్రి ప్రసన్న,టి ఆర్ ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, కార్పోరేటర్ కమర్తపు మురళీ,
సిపి ఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఐ ఎం ఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గొకినేపల్లి వెంకటేశ్వర్ రావు,బిజెపి జిల్లా అధ్యక్షులు గెల్లా సత్యనారాయణ,కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగర అధ్యక్షులు ఎం డిజావేద్,సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్ తోపాటు టియుడబ్ల్యు జె ఐజెయు జిల్లా అధ్యక్షులు ఎన్ వెంకట్రావు,ప్రధాన కార్యదర్శి ఖాధార్ బాబా, రాష్ట్ర నాయకులు ఏనుగు వెంకటేశ్వర్ రావు,
జిల్లా ఉపాధ్యక్షులు మోహిద్దిన్,స్టేట్ కౌన్సిల్ మెంబర్లు వనం వెంకటేశ్వర్లు, మాటేటి వేణుగోపాల్, ఎలక్ర్టానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు గొగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కుర్రాకుల గోపి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరి వై మాధవరావు, కోశాధికారి జనార్ధనచారి,సహాయ కార్యదర్శ ఉషోదయం శ్రీనివాస్,సామినేని మురారి,రాయల బసవేశ్వర్ రావు,
వీడియో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అలస్యం అప్పారావు, జకీర్, ఫోటో జర్నలిస్టు సంఘం అధ్యక్షులు కమటం శ్రీనివాస్ ,వివిధ పత్రికల బ్యూరో ఇంచార్జ్ లు నలజాల వెంకట్రావ్, భూపాల్, నారాయణ,శ్రీధర్, నాగేందర్ రెడ్డి,నామ పురుషోత్తం, అయ్యప్ప, డెస్క్ జర్నలిస్టులు కె ప్రసాద్ రావు, నారాయణ,మధులత తదితరులు పాల్గొన్నారు.

టియుడబ్ల్యుజె నగర అధ్యక్షులుగా మైసా పాపారావు … కార్యదర్శిగా ఉషోదయం శ్రీనివాస్

టియుడబ్ల్యుజై ఐజెయు ఖమ్మం నియోజకవర్గ కమిటిని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.అధ్యక్షులుగా మైసా పాపారావు(ఆంధ్రప్రభ) ప్రధాన కార్యదర్శి గా చెరుకుపల్లి శ్రీనివాస్ రావు(99టివి),ఉపాధ్యక్షులుగా శీలం శ్రీనివాస్ (నమస్తే తెలంగాణ) రాంబాబు(ప్రజాపక్షం),రాము(ఆంధ్రజ్యోతి),కోశాధికారిగా రాయల బసవేశ్వర్ రావు(విశాలాంధ్ర),సహాయ కార్యదర్శులుగా ఉపేందర్ (సాక్షి),సంపత్(ఎబిఎన్ ఆంధ్రజ్యోతి),శ్రీధర్ (టివి9),కార్యవర్గ సభ్యులుగా వేణుగోపాల్,కమటం శ్రీనివాస్, కొత్తూరు రమేశ్, రాము, వినయ్ ,కొమ్మినేని ప్రసాద్, కట్టకొల నాగార్జున,ఉమేశ్, విజయ్ సాగర్ రెడ్డి, మహిళా ప్రతినిధి మధులత లను ఎన్నుకున్నారు.
ఈ సందర్బంగా పలు సమస్యలపై తీర్మాణలను ప్రతిపాదించగా మహాసభ అమోదించింది.

Leave a Reply

%d bloggers like this: