చంద్రబాబు అరెస్ట్ తప్పదా ?

చంద్రబాబు అరెస్ట్ తప్పదా ?
-రాజధాని భూముల విషయంలో అవినీతిపై పోలీస్ కేసులు
-చంద్రబాబు తో పాటు మాజీమంత్రి నారాయణ ఇతరులపై కేసులు
-ఏ 1 చంద్రబాబు, ఏ 2 గా నారాయణ
-పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినా నారాయణ

ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తప్పదా ? అంటే తప్పదనే అనే మాటలు వినిపిస్తున్నాయి. అమరావతి భూముల విషయంలో అవినీతికి పాల్పడ్డారని , అక్రమాలు జరిగాయని , జగన్ సర్కార్ ప్రభుత్వం విచారణలో తేలిందని అందువల్ల వారిపై కేసులు పెట్టినట్లు సి ఐ డి అధికారులు చెబుతున్నారు . దీనికి తోడు వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు . దీంతో రంగంలోకి దిగిన అధికారులు రాజధాని భూముల అక్రమాలపై విచారణ జరిపి చర్యలు చేపట్టారు . వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి భూములపై విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే . మంత్రుల సబ్ కమిటీ కూడా అమరావతి భూములపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అందులో వెల్లడైన అంశములను శాసన సభలో కూడా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టారు . దానిపై టీడీపీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. వైసీపీ , టీడీపీ మధ్య ఇది యుద్ధం గా మారింది. చివరకు సీఆర్డీఏ రద్దు వరకు వెళ్ళింది.

మూడు రాజధానుల విషయంలో సర్కార్ వైఖరిని స్థానిక రైతులు వ్యతిరేకించారు . దానికి ఒక్క వైసీపీ మినహా మిగతా అన్ని పార్టీలు మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించాయి. రైతులు రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ సుదీర్ఘ దీక్షలు చేపట్టారు . చివరకు కోర్ట్ రైతులకు అనుకూల తీర్పు ఇవ్వడంతో వారు దీక్షలను విరమించారు . మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కార్ వెనక్కు తీసుకుంటున్నట్లు శాసనసభలోని ప్రకటించింది. అప్పుడే రాజధానుల విషయంలో వెనక్కు తగ్గేది లేదని తిరిగి సమగ్రంగా బిల్లు తీసుకోని వస్తామని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు .

సిఆర్దీ ఏ ద్వారా సేకరించిన భూములను అభివృద్ధి చేయడంతో పాటు రాజధానిలో ఆగిపోయిన నిర్మాణాలను వెంటనే పూర్తీ చేయాలనీ హైకోర్టు ఆదేశించింది. కోర్ట్ ఆదేశాలతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. పనులు ప్రారంభం అయ్యాయి . కానీ జరిగిన అక్రమాలపై ఫిర్యాదుల ఆధారంగా తిరిగి సి ఐ డి అధికారులు చంద్రబాబు తో పాటు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పై కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు పై కేసు ఆశక్తిగా మారింది.

Leave a Reply

%d bloggers like this: