Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నారాయణ అరెస్ట్ పై టీడీపీ గగ్గోలు …చట్టం తనపని తాను చేసుకుపోతుందన్న వైసీపీ!

నారాయణ అరెస్ట్ పై టీడీపీ గగ్గోలు …చట్టం తనపని తాను చేసుకుపోతుందన్న వైసీపీ!
-నారాయ‌ణ అరెస్ట్ ముమ్మాటికీ క‌క్ష‌పూరిత‌మే: చంద్ర‌బాబు
-ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో ప్ర‌భుత్వం విఫ‌లమైందన్న బాబు
-వైఫ‌ల్యాన్ని క‌ప్పిపుచ్చునేందుకే నారాయ‌ణ అరెస్ట్‌ అని విమర్శ
-నోటీసుల్లేకుండా అరెస్ట్ అంటే క‌క్ష‌పూరితం కాదా అన్న చంద్ర‌బాబు

ఏపీ లో రాజకీయాలు రంజుగా మారాయి. రాజధాని భూములు , ప్రశ్నపత్రాల లీకేజ్ విషయంలో టీడీపీ నాయకులపై ప్రభుత్వం కేసు నమోదు చేయడమే కాకుండా నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్టు చేయడం లో ఏపీలో కలకలం రేపింది. ఇది ముమ్మాటికీ కక్షపూరితమని టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు . లేదు వారు చేసిన అవినీతి అక్రమాలకు చట్టం తనపని తాను చేసుకుపోతుందని వైసీపీ నేతలు రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు .

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, నారాయ‌ణ విద్యా సంస్థ‌ల అధినేత పొంగూరు నారాయ‌ణ అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు స్పందించారు. నారాయ‌ణ అరెస్ట్ ముమ్మాటికీ క‌క్ష‌సాధింపేన‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించిన చంద్ర‌బాబు… ఆ వైఫ‌ల్యాన్ని క‌ప్పి పుచ్చుకునేందుకే నారాయ‌ణ‌ను అరెస్ట్ చేసింద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ముంద‌స్తు నోటీసు ఇవ్వ‌కుండా అరెస్ట్ చేయ‌డం అంటే క‌క్ష‌పూరిత చ‌ర్య కాదా? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

విద్యాసంస్థల్లో ఎవరైనా తప్పు చేస్తే చైర్మన్ ను అరెస్ట్ చేస్తారా?: సోమిరెడ్డి

టీడీపీ మాజీ మంత్రి, నారాయణ సంస్థల అధినేత నారాయణ అరెస్ట్ పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నారాయణ అరెస్ట్ పై ప్రభుత్వం కారణం చెప్పే పరిస్థితి లేదని ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. గంటగంటకు ఎఫ్ఐఆర్ మార్చుతున్న పరిస్థితి కనిపిస్తోందని ఆరోపించారు.

టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, నారాయణ విద్యాసంస్థలంటే అంత ఆషామాషీగా ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని 23 రాష్ట్రాల్లో నారాయణ విద్యాసంస్థల ద్వారా బోధన జరుగుతోందని వెల్లడించారు. 6 లక్షల మందికి పైగా విద్యార్థులు, 60 వేల మందికి పైగా ఉద్యోగులతో నడుస్తున్న విద్యాసంస్థలు అని వివరించారు. ప్రస్తుతం విద్యాసంస్థల బాధ్యతలను నారాయణ పిల్లలు చూసుకుంటున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక విద్యాసంస్థల బాధ్యతలను నారాయణ పూర్తిగా వదిలేశారని సోమిరెడ్డి స్పష్టం చేశారు.

విద్యాసంస్థల్లో ఎవరైనా తప్పు చేస్తే చైర్మన్ ను అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. విద్యాశాఖలో లీకేజిపై విద్యాశాఖ మంత్రిని అరెస్ట్ చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. కక్షపూరిత రాజకీయాలకు వైసీపీ ఇకనైనా స్వస్తి పలికాలని హితవు పలికారు.

తప్పు చేస్తే వదిలేది లేదు.. నారాయణ అరెస్ట్ పై మంత్రి బొత్స

రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఎవరున్నా అరెస్ట్ చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. తప్పు ఎవరు చేసినా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రం ఎక్కడ లీకైందో అధికారులు విచారణ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు.

అరెస్టయిన వాళ్లు తప్పు చేయలేదని నిరూపించుకోవాలన్నారు. అక్రమాలు జరగకుండానే ఎందుకు అరెస్ట్ చేస్తామన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఇప్పటిదాకా 60 మందిని అరెస్ట్ చేశామన్నారు. కాగా, అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ డిజైన్ లో అక్రమాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు చంద్రబాబు, నారాయణపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.

నారాయణ పక్కా బిజెనెన్ మేన్: అంబటి రాంబాబు

పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయిన ఘటనలో నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నారాయణను హైదరాబాద్ నుంచి చిత్తూరుకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించారని మండిపడ్డారు.

ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, నారాయణ పక్కా బిజినెస్ మేన్ అని చెప్పారు. పేపర్ లీకేజీలో నారాయణ పాత్ర ఉన్నట్టు విచారణలో ప్రాథమికంగా నిర్ధారించారని అన్నారు. నారాయణ కాలేజీలో పేపర్ లీక్ అయిందని చెప్పారు. పేపర్ లీక్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు.

నారాయ‌ణ అరెస్ట్‌పై స‌జ్జ‌ల స్పంద‌న ఇదే

టెన్త్ ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంలో టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ అరెస్ట్‌ కావడంపై వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తాజాగా స్పందించారు. అధికారుల‌కు స్వేచ్ఛ ఇవ్వ‌డం వ‌ల్ల‌నే నారాయ‌ణ దొరికిపోయార‌న్న స‌జ్జ‌ల‌.. రికార్డుల పేరుతో నారాయ‌ణ త‌ప్పుడు విధానాల‌కు పాల్ప‌డ్డార‌ని వ్యాఖ్యానించారు.

కాపీయింగ్‌ను ఆర్గ‌నైజ్డ్ క్రైమ్‌ (వ్యవస్థీకృత నేరం)గా నారాయ‌ణ చేయించారన్న ఆయ‌న‌… ఇలాంటి త‌ప్పుడు విధానాన్ని గ‌త ప్ర‌భుత్వం ప్రోత్స‌హించిందని ఆరోపించారు. ప్ర‌స్తుత‌ ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో త‌ప్పు బ‌య‌ట‌ప‌డిందని స‌జ్జ‌ల చెప్పారు. చ‌ట్టం ఎవ‌రి విష‌యంలో అయినా స‌మానంగా ప‌ని చేస్తుందని, ప్ర‌భుత్వం దృష్టిలో ఎవ‌రైనా ఒక‌టేన‌ని తెలిపారు. త‌ప్పు చేశార‌ని తెలియ‌డం వ‌ల్లే వైఎస్ కొండారెడ్డిని అరెస్ట్ చేశారంటూ స‌జ్జ‌ల వ్యాఖ్యానించారు.

Related posts

ఈట‌ల రాజేంద‌ర్ కోస‌మే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది: కేటీఆర్!

Drukpadam

పెగాసస్’తో నిఘాపెట్టారని మేం చెప్పలేదంటున్న అమ్నెస్టీ…

Drukpadam

పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వండి …. సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి భావిరంగా లేఖ …

Drukpadam

Leave a Comment