జర్నలిస్ట్ హెల్త్ కార్డు సేవలను త్వరలో పరిష్కరిస్తా … ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు!

జర్నలిస్ట్ హెల్త్ కార్డు సేవలను త్వరలో పరిష్కరిస్తా … ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు!
౼ ఫోన్ నెంబర్ లింక్‌తో అడ్డంకులను తొలగిస్తాం
౼ వెల్‌నెస్‌ సెంటర్లో నిలిచిన సేవలను త్వరలో ప్రారంభిస్తాం
౼ సమాచార శాఖకు సమాచారం పంపిస్తాం
౼ వరంగల్ జిల్లా పర్యటనలో టీయూడబ్ల్యూ జె నేతలకు మంత్రి హరీశ్ రావు హామీ

జర్నలిస్టులకు అమలు చేస్తున్న హెల్త్ కార్డులు కూడా నామ మాత్రం గా మారి పోయాని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి టీయూడబ్ల్యూ జె (ఐజేయూ ) నేతలు తీసుకొచ్చారు . తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్టు (ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి గాడిపెల్లి మధు గౌడ్,వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాం రాంచందర్ , వర్థన్నపేటలో పర్యటిస్తున్న మంత్రిని కలిసి జర్నలిస్టులు హెల్త్ కార్డు ల విషయంలో ఎదురుకొంటున్న సమస్యలపై వినతి పత్రం అందించారు . కొత్తగా అమలులోకి తెచ్చిన హెల్త్ కార్డులకు OTP ఫోన్ నెంబర్ లింకు పేరుతో సేవలకు అంతరాయం కలుగుతుందని వారు మంత్రికి తెలిపారు . వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా జర్నలిస్టులకు అందిస్తున్న వైద్య సౌకర్యం, ఉచిత మందులు పంపిణీ ఈ నెల నుంచి నిలిచిపోయిన విషయాన్నీ గుర్తు చేశారు.

హెల్త్ కార్డు కు ఫోన్ నెంబర్ లింక్ చేసే బాధ్యత డి పి ఆర్ ఓ లకు అప్పగించినట్లు వెల్నెస్ సెంటర్లలో నోటీసులు పెట్టి వైద్య ఆరోగ్య శాఖ చేతులు దులుపుకుందని వారు వివరించారు .
ఫలితంగా హెల్త్ కార్డులకు ఫోన్ నెంబర్ లింక్ చేయించేందుకు సమాచార శాఖ కార్యాలయాలు వెళ్తున్న జర్నలిస్టులకు మొండి చెయ్యి ఎదురవుతోందని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
హెల్త్ కార్డులకు ఫోన్ నెంబర్ లింక్ విషయమై ఎలాంటి సమాచారం ఉన్నతాధికారుల నుంచి రాలేదని జిల్లా సమాచార శాఖ అధికారులు ముఖం మీదే చెబుతున్నారని. దీంతో ఈ ఫోన్ నెంబర్ లింక్ ఎవర్ని అడగాలో తెలియక జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నవిషయాన్నీ మంత్రి దృష్టికి తీసుకోని పోయారు . జర్నలిస్టులు సమస్యలపై మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించారు .
హెల్త్ కార్డుల విషయంలో జర్నలిస్టులకు ఎదురౌతున్న సమస్యలను అధికారులతో చర్చించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకొంటామని మంత్రి హామీ ఇచ్చారు .
ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యం తో బాధ పడుతున్న జర్నలిస్టులకు ఎంతో కొంత ఉపయోగపడుతున్న ఉచిత మందులు నిలిచిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్న విషయంపై వెంటనే తగు చర్యలు తీసుకుంటామని ఇవి నాదృష్టికి కూడా వచ్చాయని మంత్రి అన్నారు . ఇది ఎక్కడో ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయా ? అని విషయం కూడా పరిశీలిస్తానని అన్నారు .

ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ అభివృద్ధికి, సేవలు మెరుగుపరిచేందుకు కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ప్రకటిస్తుండగా మరోవైపు ఉన్న సేవలకు కోత విధించడంలో అర్థం లేదని జర్నలిస్ట్ సంఘ నేతలు తెలపగా త్వరలోనే జర్నలిస్టులందరికి న్యాయం జరిగేవిధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు .

జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం బాగుంటుందని జర్నలిస్టులు అంటే ప్రభుత్వానికి పూర్తిగా తెలుసు అని . ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాల అమలులో జర్నలిస్టులకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు .

తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించిన జర్నలిస్టుల పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి వ్యతిరేకతతో వ్యవహరించడం లేదని మంత్రి అన్నారు జర్నలిస్టుల హెల్త్ కార్డ్ విషయం లో వర్ధన్నపేట శాసన సభ్యులు ఆరూరి రమేష్ కల్పించుకోని మంత్రికి వివరంగా చేప్పడం జరిగింది , వెంటనే మంత్రి దయాకర్ రావు కూడా మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకోచ్ఛారు , త్వరలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కారం చేస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు.

Leave a Reply

%d bloggers like this: