నారాయణ బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టును ఆశ్రయించే దిశగా ఏపీ ప్రభుత్వం!
నారాయణ బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టును ఆశ్రయించే దిశగా ఏపీ ప్రభుత్వం!
-టెన్త్ క్వశ్చన్ పేపర్ల లీక్‌లో నారాయణ అరెస్ట్
-వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ఇచ్చిన చిత్తూరు కోర్టు
-నారాయణ బెయిల్‌ను సవాల్ చేసే దిశగా ఏపీ ప్రభుత్వం
-రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసే అవకాశం
సంచలనంగా మారిన మాజీమంత్రి పి.నారాయణ బెయిల్ …దీనిపై ఏపీ సర్కార్ నేడు న్యాయ నిపుణలతో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. కింది కోర్ట్ ఇచ్చిన బెయిల్ రద్దు చేయించే దిశగా చర్యలు చేపట్టినట్లు ద్రువీకరించని వార్తలు తెలియజేస్తున్నాయి. నిజంగా నారాయణ బెయిల్ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకుందా? లేక ఉత్తి ప్రచారమేనా అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. నారాయణ ప్రశ్నపత్రాల లీకేజ్ లో ప్రధాన సూత్రధారి అని అంతకు ముందు అరెస్ట్ అయిన నిందితులు చెప్పిన సమాచారం ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు . దర్యాప్తు ఆధారంగా నారాయణ అరెస్ట్ జరిగింది. హైద్రాబాద్ లో అరెస్ట్ చేసిన చిత్తూరు పోలీసులు ఏపీ కి తీసుకోని పోయారు . అక్కడ కేసు నమోదు చేసి కోర్ట్ లో హాజరు పరిచారు . అయితే కోర్ట్ ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే . పేపర్ లీకేజ్ లో నారాయణ పాత్రపై సరైన ఆధారాలు లేవని కోర్ట్ అభిప్రాయపడింది. దీంతో ఆయన కు బెయిల్ సులువుగానే లభించింది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణకు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయించే దిశగా ఏపీ ప్రభుత్వం సాగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి, ఈ దిశగా ఏపీ ప్రభుత్వ వర్గాలు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన నారాయణకు చిత్తూరు కోర్టు వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నారాయణ బెయిల్‌ను సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో గురువారం నాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.