శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతానికి విదేశీ బంగారు వర్ణ రథాన్ని తీసుకొచ్చిన తుపాను!

శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతానికి విదేశీ బంగారు వర్ణ రథాన్ని తీసుకొచ్చిన తుపాను!
అసని తుపాను కారణంగా అల్లకల్లోలంగా బంగాళాఖాతం
సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు కొట్టుకొచ్చిన రథం
రథాన్ని స్వాధీనం చేసుకున్న మెరైన్ పోలీసులు

అసని తుపాను కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంది. భారీ అలలు తీరంపై విరుచుకుపడుతున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది.

విదేశాలకు చెందిన, బంగారు వర్ణంలో ఉన్న ఓ రథం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. సంతబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవు వద్దకు ఇది కొట్టుకొచ్చింది. ఈ రథంపై 16-1-2022 తో పాటు విదేశీభాష కనిపిస్తోంది. ఇది థాయిలాండ్ లేదా మలేషియా, లేదా జపాన్ దేశాలకు చెందినదై ఉండొచ్చని కొందరు మత్స్యకారులు చెపుతున్నారు.

హుదూద్, తిత్లీ వంటి పెను తుపానులు వచ్చినప్పుడు కూడా ఇలాంటివి ఎప్పుడూ కొట్టుకుని రాలేదు. సముద్రంలో ఇంత దూరం రథం కొట్టుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ రథాన్ని చూడ్డానికి స్థానికులు పోటెత్తారు. మరోవైపు దీన్ని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ రథం ఎక్కడనుంచి వచ్చింది అనేదిశగా మెరైన్ పోలీసులు ఆరా తీస్తున్నారు . ఒకపక్క తుఫాన్ తో సముద్రం అల్లకల్లోలంగా ఉండటం జోరుగా వర్షాలు ఉన్నప్పటికీ సముద్రంలో కొట్టుకొని వచ్చిన బంగారు వర్ణ రథాన్ని తిలకించేందుకు ప్రజలు పోటెత్తారు . ఎంత దూరం నుంచి ఇక్కడ కు వచ్చింది. అనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు . చూడటానికి బంగారం తో తయారు చేశారా ? అన్నట్లుగా అది ఉంది. పిల్లలు పెద్దలు ఈ వింత దృశ్యాన్ని చూసి ఆనందిస్తున్నారు .

Leave a Reply

%d bloggers like this: