టీడీపీ ,జనసేన పొత్తు … 60 సీట్లు కావాలంటున్న జనసేన…?

టీడీపీ ,జనసేన పొత్తు … 60 సీట్లు కావాలంటున్న జనసేన…?
రెండు పార్టీలు పొత్తుకు మానసికంగా సిద్ధపడినట్లు వార్తలు
బీజేపీ కలిస్తే 10 సీట్లు ఇచ్చే అవకాశం
జనసేనకు 30 ,టీడీపీ 135 సీట్లలో పోటీకి సిద్ధపడుతున్నట్లు వార్తలు
లెఫ్ట్ పార్టీలు ఈ కూటమికి దూరం …

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకోసం రాజకీయపార్టీలు ఇప్పటినుంచే కసరత్తు మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా టీడీపీ , జనసేన పొత్తు పెట్టుకునేందుకు సిద్ధపడుతున్నాయి. వారి మధ్య ఇప్పటికే ఒక అవగాహనా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. టీడీపీ తో పొత్తుకు సిద్దమైన జన సేన తమకు 60 కావాలని అడుగు తున్నట్లు సమాచారం . అయితే మిగతా పార్టీలతో సంప్రదింపులు జరిపిన తరువాత సీట్ల వ్యవహారం మాట్లాడుకుందామని అందరం కలిస్తేనే వైసీపీ ని ఎదుర్కొనే అవకాశం ఉందని విడిపోయి పోటీచేస్తే వైసీపీ కి అడ్వాంటేజ్ ఉంటుందనే అభిప్రాయాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు .

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. వీటిల్లో జ‌న‌సేన 60 సీట్లు అడుగుతోందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక‌వేళ బీజేపీతో పొత్తుంటే తెలుగుదేశం పార్టీ 135 సీట్ల‌లో, జ‌న‌సేన‌కు 30 సీట్లు, బీజేపీకి 10 సీట్లు అంటూ గ‌తంలో ఒక వార్త చ‌క్క‌ర్లు కొట్టింది. అయితే బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు తాము కుటుంబ పార్టీలోను, అవినీతి పార్టీల‌తోను పొత్తుపెట్టుకోమంటూ ప్ర‌క‌టించారు. బీజేపీకి జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం. పార్టీ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా ఉండేందుకు పొత్తుల‌పై సిద్ధంగానే ఉన్నామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. అయితే బీజేపీ ఇచ్చే రోడ్‌మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నాన‌న్నారు. బీజేపీ టీడీపీ తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా లేదు . టీడీపీ నేతలు మాత్రం పొత్తులపై మాట్లాడేందుకు సోము వీర్రాజు ఎవరు వారి హైకమాండ్ ఢిల్లీలో ఉందని అంటున్నారు .అంటే బీజేపీ తో పొత్తుకోసం టీడీపీ ఆశతో ఉన్నట్లు అర్థం అవుతుంది. వైసిపిని సింగిల్ గా కొట్టడం సాధ్యం కాదని టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు . సింగిల్ గా 151 సీట్లు గెలుచుకున్న పార్టీ అక్కడ ఒక బకాసురుడు ఉన్నాడు అని ఆయన్ను ఎదుర్కోవడం అంటే అంత తేలికకాదని బహిరంగంగానే అంగీకరిస్తున్నారు .

మరి టీడీపీ పొత్తుల ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో ,జనసేన , బీజేపీ లు ఏ వైఖరి తీసుకుంటాయని దానిపై ఆధారపడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉంటాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు .

 

Leave a Reply

%d bloggers like this: