తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ అప్రమత్తం …

తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ అప్రమత్తం …
-అసని తెలంగాణ పై ఎఫెక్ట్ …పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
-రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములతో కూడని జల్లులు
-గత రెండు రోజులుగా హైద్రాబాద్ లో వర్షాలు
-ఖమ్మం , నల్లగొండ , వరంగల్ ,ఆదిలాబాద్ జిల్లాలకు ఎఫెక్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయిగుండం ప్రభం వల్ల ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతుండగా కొన్ని జిల్లాలో రెడ్ హెచ్చరికలు జారీచేశారు . సహక చర్యలను ముమ్మరం చేశారు . దానిప్రభం తెలంగాణ జిల్లాలపై కూడా పడింది. ఫలితంగా ఉమ్మడి ఖమ్మం , నల్లగొండ , వరంగల్ , ఆదిలాబాద్ జిల్లాలో తేలికపటినుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసింది.

తెలంగాణపై అసని తుఫాన్ ఎఫెక్ట్ పడింది. దీంతో ఎనిమిది జిల్లాల్లోని పలుచోట్ల ఇవ్వాళ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

అలాగే బుధ, గురువారాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే మూడ్రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ క్రమంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో తేలికపాటి వర్షాలు ప్రారంభమయ్యాయి. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడుతున్నాయి. ఇటు ఏపీకి సమీప ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరికొద్ది సేపట్లో నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌ను ఇప్పటికే మబ్బులు కమ్మేశాయి. ప్రస్తుతం పలుచోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి. నల్లగొండ ,సూర్యాపేటలో వర్షాలు పడినట్లు సమాచారం .ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి.

Leave a Reply

%d bloggers like this: