ఏజన్సీ ప్రాంత బి టి రోడ్ల అభివృద్ధి పై ఎస్టీ ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశం!

ఏజన్సీ ప్రాంత బి టి రోడ్ల అభివృద్ధి పై ఎస్టీ ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశం!
-తమ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం పై ప్రతిపాదనలు ఇచ్చిన ఎమ్మెల్యేలు
-నిర్ణయ సమయంలో పూర్తీ చేయాలనీ కోరిన ఎమ్మెల్యేలు
-మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన సమావేశం

రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మంజూరు చేయాల్సిన బిటి రోడ్ల ప్రతిపాదనల ఖరారుకు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ డవలప్మెంట్-సమావేశం హైదరాబాద్ లోని మసాబ్‌ట్యాంక్ డి ఎస్ ఎస్ భవన్ లో జరిగింది.తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్రంలోని ఎస్టీ నియోజకవర్గాల గౌరవనీయ ఎమ్మెల్యేలందరితో సమావేశంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ సభ్యులు రమావత్ రవీందర్ కుమార్. ఆసిఫాబాద్ శాసనసభ సభ్యులు ఆత్రం సక్కు, వైరా శాసనసభ సభ్యులు లావుడ్యా రాములునాయక్‌ , డోర్నకల్ శాసనసభ సభ్యులు డి ఎస్ రెడ్యా నాయక్, పినపాక శాసనసభ సభ్యులు రేగా కాంతారావు,
బోథ్ శాసనసభ సభ్యులు రాథోడ్ బాపు రావు, ఖానాపూర్ శాసనసభ సభ్యులు అజ్మీర రేఖ, మహబూబాబాద్ శాసనసభ సభ్యులు బానోత్ శంకర్ నాయక్, ఇల్లందు శాసనసభ సభ్యులు బానోత్ హరిప్రియ,ములుగు శాసనసభ సభ్యులు ధనసరి అనసూయ.మరియు టీడబ్ల్యూ అడిషనల్ సెక్రటరీ శ్రీధర్ ఐ ఏ ఎస్, టిడబ్ల్యూ సెక్రటరీ మరియు కమిషనర్ డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు ఐ ఏ ఎస్, టిడబ్ల్యూ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

%d bloggers like this: